Mathu Vadalara 2 Movie Review | ‘మత్తువదలరా2’ కు మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది: డైరెక్టర్ రితేష్ రానా | Eeroju news

Mathu Vadalara 2 Movie Review

‘మత్తువదలరా2’ కు మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది: డైరెక్టర్

రితేష్ రానా

Mathu Vadalara 2 Movie Review

 

శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిలేరియర్స్ థ్రిల్లర్ ‘మత్తువదలరా2’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షుకులని అలరించిన హిలేరియస్ బ్లాక్ బస్టర్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రితేష్ రానా విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

‘మత్తువదలరా2’తో పెద్ద హిట్ కొట్టారు.. కంగ్రాట్యులేషన్స్
-థాంక్ యూ
చిరంజీవి గారు, మహేష్ బాబు గారు అప్రిషియేట్ చేయడం ఎలా అనిపించింది. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు ?
-బెస్ట్ కాంప్లిమెంట్ అంటే.. టీం అంతా హ్యాపీ గా వుంది. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. నెక్స్ట్ చిరంజీవి గారు ట్వీట్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది.
సీక్వెల్ చేయాలనే ఆలోచన మొదటి నుంచి ఉందా ?
-సీక్వెల్ చేయాలని చెర్రీగా ఎప్పటినుంచో అన్నారు. అయితే ఆర్గానిక్ గా ఓ మంచి ఐడియా వస్తేనే చేయాలి. అలాంటి ఐడియా క్రాక్ చేసి చెర్రీగారికి, టీంకి చెప్పాను. అది అందరికీ నచ్చింది. మేము అనుకున్నట్లే వర్క్ పుట్ అయ్యింది. ఆడియన్స్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

ఖుషి రిఫరెన్స్ తీసుకొని అజయ్ క్యారెక్టర్ చేయాలనే ఐడియా ఎవరిది ?
-నాదే. ఆ క్యారెక్టర్ గ్రో చూపించాలనేది ఐడియా. వున్న మూడు నిమిషాల్లో ఆయన క్యారెక్టర్ ఎస్టాబ్లెస్ చేయాలనుకున్నపుడు ఆయన చేసిన పాత సినిమాని వాడాలకున్నాను. అలా చూసిన వెంటనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారనేది ఆలోచన.
సత్య చేసిన పదహారేళ్ళ వయసు సాంగ్ ముందే ప్లాన్ చేశారా ?
-అది ఫస్ట్ పార్ట్ లో తీసింది. అప్పుడు లెంత్ ఎక్కువైయిందని కట్ చేశాం. సెకండ్ పార్ట్ లో మళ్ళీ అలాంటి సిట్యువేషన్ వచ్చినపుడు అది ప్లేస్ చేశాం. థియేటర్స్ లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

స్లేవ్ డ్రగ్ కాన్సెప్ట్ ఏమిటి ?
-స్లేవ్ డ్రగ్ ని ఒక మెటాఫర్ లా వాడం. మత్తు అనేది కేవలం నార్కోటిక్స్ నే కాదు. మత్తు చాలా రకాలుగా వుంది. ముత్తు నుంచి బయటపడటం మంచిదని చెప్పడం దాని ఉద్దేశం.

Mathu Vadalara 2 Movie Review

 

Blockbuster horror thriller movie ‘Demonty Colony 2’ is coming to grand theatrical release on 23rd of this month | ఈ నెల 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ డీమాంటీ కాలనీ 2 | Eeroju news

Related posts

Leave a Comment