Maldives vs Modi | మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ | Eeroju news

మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ

మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ

న్యూఢిల్లీ, అక్టోబరు 8, (న్యూస్ పల్స్)

Maldives vs Modi

PM Modi meets Maldives President Solih, ink six pacts to broad-base ties | Latest News India - Hindustan Timesమాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షి చర్చలు జరిగాయి. హైదరాబాద్ హౌస్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాల్దీవుల్లోని హనిమధూ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ , మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. అదే సమయంలో రూపే కార్డు ద్వారా చెల్లింపు మాల్దీవులలో ప్రారంభించారు.PM Modi announces $1.4 billion aid to bail out Maldives from economic crisis | India News - The Indian Express

ప్రధాని నరేంద్ర మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జూ తొలిసారిగా ఇలాంటి లావాదేవీలకు శ్రీకారం చుట్టారు.మాల్దీవుల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివి అని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం మాల్దీవులకు అత్యంత సన్నిహిత పొరుగు, సన్నిహిత మిత్రుడు అన్నారు. నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ, సాగర్ విజన్‌లో మాల్దీవులకు ముఖ్యమైన స్థానం ఉంది అని ప్రధాని మోదీ అన్నారు.

రక్షణ, భద్రతా సహకారానికి సంబంధించిన వివిధ అంశాలను వివరంగా చర్చించామని మోదీ తెలిపారు. ఏకథా హార్బర్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వం, శ్రేయస్సు కోసం రెండు దేశాలు కలిసి పని చేస్తాం. కొలంబోలో వ్యవస్థాపక సభ్యులుగా సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌లో మాల్దీవులు చేరడానికి స్వాగతం పలుకుతున్నట్లు ప్రదాని మోదీ తెలిపారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో ఈ సమావేశం గురించి సమాచారం ఇస్తూ, “భారత్-మాల్దీవుల ప్రత్యేక సంబంధాన్ని ముందుకు తీసుకువెళుతోంది. హైదరాబాద్ హౌస్‌కు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజును ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతించారు. భారత్-మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చ ఉంటుంది.” అంటూ పేర్కొన్నారు.

మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ

Modi on a 4-day foreign visit | 4 రోజుల విదేశీ పర్యటనకు మోడీ | Eeroju news

Related posts

Leave a Comment