Mahesh Kumar Goud:ఆస్ట్రేలియా పర్యటనలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

TPCC Chief Mahesh Kumar Goud's team is on a tour of Australia

ఆస్ట్రేలియా పర్యటనలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

సిడ్నీ
టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బృందం ఆస్ట్రేలియా పర్యటనలో వుంది. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి నేతృత్వంలో పర్యటన కొనసాగుతోంది. విక్టోరియా రాష్ట్రం మెల్బోర్న్ నగరంలో ప్రభుత్వ అధికారుల ప్రతినిధి బృందంతో సమావేశమైంది. క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆ రాష్ట్ర అధికారులతో క్రీడలపై చర్చించింది. క్రీడలు, మౌళిక వసతులపై అధ్యయనం చేసేందుకు ఆస్ట్రేలియాలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది. బృందంలో కరాటే రాష్ట్ర అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు క్రీడలు జీతేందర్ రెడ్డి, స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి, స్పోర్ట్స్ ఎండీ సోనీ బాల, హాకీ ఫెడరేషన్ రాష్ట్ర ఛైర్మన్ మహ్మద్ ఫహీమ్ ఖురేషి, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ తదితరులున్నారు.

Read:NTR:బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత ఎన్‌టీఆర్‌దే

Related posts

Leave a Comment