Mahbub Nagar:వారి నిర్లక్ష్యమే- వీరికి శాపం

SLBC Tunnel. Will the 8 workers from different states trapped in the tunnel get out safe or the same suspense is everywhere.

Mahbub Nagar:వారి నిర్లక్ష్యమే- వీరికి శాపం:నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం ప్రాజెక్టును ఆనుకుని నిర్మిస్తున్న ఎస్ ఎల్ బీసీ టన్నెల్ . టన్నెల్‌లో చిక్కుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 8 మంది కార్మికులు క్షేమంగా బయటపడతారా, లేదా ఇదే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది. అయితే ఈ ప్రమాదం ఏదో కాకతాళియంగా జరిగింది కాదు. ప్రకృతి ప్రకోపమో కాదు, కేవలం నిర్లక్ష్యం. ఎస్ ఎల్ బీసీ ని ఆది నుంచి వెంటాడుతున్న నిర్లక్ష్యం. ఇదే ఈరోజు ఎనిమిది మంది ప్రాణాలను డేంజర్‌లో నెట్టింది. వారు ప్రాణాలతో బతికిబట్టకట్టడమంటే సాధారణ విషయం కాదు.

వారి నిర్లక్ష్యమే- వీరికి శాపం

మహబూబ్ నగర్ ఫిబ్రవరి 25
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం ప్రాజెక్టును ఆనుకుని నిర్మిస్తున్న ఎస్ ఎల్ బీసీ టన్నెల్ . టన్నెల్‌లో చిక్కుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 8 మంది కార్మికులు క్షేమంగా బయటపడతారా, లేదా ఇదే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది. అయితే ఈ ప్రమాదం ఏదో కాకతాళియంగా జరిగింది కాదు. ప్రకృతి ప్రకోపమో కాదు, కేవలం నిర్లక్ష్యం. ఎస్ ఎల్ బీసీ ని ఆది నుంచి వెంటాడుతున్న నిర్లక్ష్యం. ఇదే ఈరోజు ఎనిమిది మంది ప్రాణాలను డేంజర్‌లో నెట్టింది. వారు ప్రాణాలతో బతికిబట్టకట్టడమంటే సాధారణ విషయం కాదు. అందుకే ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్, హైడ్రా ఇలా కేంద్ర, రాష్ట్ర బలగాలు, నిపుణులు గత మూడు రోజులుగా కార్మికులను ప్రాణాలతో టన్నెల్ నుంచి బయటకు తెచ్చిందుకు చేయని ప్రయత్నం లేదు. ఎప్పుడు ఆపరేషన్ సక్సెస్ అవుతుందో తెలియని అయోమయం ఓ వైపు, లోపల చిక్కుకున్న వారు క్షేమంగా ఉండాలని, తిరిగి ప్రాణాలతో తమ చెంతకు చేరాలని కుటుంబ సభ్యుల ప్రార్థనలు మరోవైపు, ఇలా దోమలపెంటలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఎస్ ఎల్ బీసీ శంకుస్దాన మొదలు నేటి వరకూ అన్ని అవాంతరాలే. అంచానలకు మించి అవరోధాలే ఎదురవుతూనే ఉన్నాయి. శ్రీశైలం ద్వారా 30 టిఎంసీల కృష్ణా నీటిని టన్నెల్ ద్వారా తరలించిన తెలంగాణలో 4లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు , హైదరాబాద్ కు త్రాగునీటి కష్టాలను తీర్చాలనే సంకల్పంతో 2004లో ఎస్ ఎల్ బీసీ శంకుస్దాన చేసి, పనులు ప్రారంభించారు.

నాలుగేళ్లలో టెన్నెల్ తవ్వకం పూర్తి చేసి నీటిని టెన్నెల్ మార్గం ద్వారా ప్రధాన కాలువలు,అటు నుండి వ్యవసాయ భూములకు తరలించాలి. కాని నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిన ఎస్ ఎల్ బీసీ నేటికి రెండు దశాబ్ధాలు, ఏకంగా ఇరవై ఏళ్లు దాటినా నేటికీ పనులు ముందుకు సాగడం లేదు. అవాంతరాలే ఎదరువుతూనే ఉన్నాయి. తాజాగా టన్నెల్‌లో 14 కిలోమీటర్ వద్ద పైభాగం విరిగిపడటంతో అప్పటికే పనిలో ఉన్న 50 మంది కార్మికులు ప్రాణాలు అరచేతపట్టుకుని పరుగులు పెడుతూ మిగతావారు తప్పించుకుని బయటకు రాగా, 8 మంది ఇంకా లోపలే మృత్యువుతో పోరాడుతున్నారు.టన్నెల్ మార్గంలో గత కొద్ది నెలలుగా ముఖ్యంగా పైకప్పు భాగంలో లీకేజ్ జరుగుతోంది. ఆ లీకేజ్‌ని తాత్కాలికంగా కాంక్రీట్ వేసి ఆపే ప్రయత్నం చేశారు. కొంత వరకు లీకేజి ఆగినట్లు కనిపించినా, పూర్తిగా ఆగకపోవడంతో అమాంతం కూలే పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నాలుగేళ్ల క్రితం టన్నెల్‌లో పని చేసే బోరింగ్ మిషన్ పాడైతే దానిని రిపేరు చేయడానికి ఏకంగా నాలుగేళ్ల సమయం పట్టింది. ఆ తరువాత కొత్త బోరింగ్ మిషన్ అమర్చి కేవలం కిలోమీటర్లు తవ్వగానే అది కాస్తా చెడి పోయింది. ఆ తరువాత 2023 జనవరి నుంచి అనివార్య కారణాల వల్ల అవుట్ లెట్ పనులు ఆగిపోయాయి. మట్టి రాళ్లు అడ్డుగా పడిపోవడంతో పనులు ముందుకు సాగలేదు. టన్నెల్ బోరింగ్ మిషన్ మూడేళ్లుగా నీటిలో ఉండిపోయింది. ఇలా ఒకటేమిటి ఎస్ ఎల్ బీసీ ప్రారంభమైన నాటి నుంచి అన్ని అడ్డంకులే, అంతేకాదు అంచనా వ్యయం కూడా ఊహలకందని స్థాయిలో పెరిగిపోయింది. 2024లో 1925 కోట్ల రూపాయలున్న అంచనా వ్యయం ఇప్పుడు ఏకంగా 4637 కోట్లకు చేరుకుంది. ఎట్టకేలకు 2026 నాటికైనా పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకెళ్తుంటే, ఇదిగో ఇలా ఊహించని పెను ఉపద్రవం మళ్లీ బ్రేక్ వేసింది. ఇలా సంకల్పం మంచిదైనా, మారుతున్న ప్రభుత్వాల నిర్లక్ష్యంఎస్ ఎల్ బీసీ పాలిట శాపంగా మారింది.

Read more:Hyderabad:ఇక ఆన్ లైన్ లోనే సీఎంఆర్ ఎఫ్ దరఖాస్తులు

Related posts

Leave a Comment