Mahbub Nagar:పాలమూరు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు

Who is the President of Palamuru Congress?

మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి నియామకం కోసం టీ పీసీసీ అన్వేషణ మొదలుపెట్టింది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న మధుసూదన్ రెడ్డి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మధుసూదన్ రెడ్డి అధ్యక్ష పదవికి ఎన్నికై రెండేళ్లు గడిచిపోవడం, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో జిల్లా అధ్యక్షుడు నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.

పాలమూరు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు.

మహబూబ్ నగర్, డిసెంబర్ 31
మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి నియామకం కోసం టీ పీసీసీ అన్వేషణ మొదలుపెట్టింది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న మధుసూదన్ రెడ్డి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మధుసూదన్ రెడ్డి అధ్యక్ష పదవికి ఎన్నికై రెండేళ్లు గడిచిపోవడం, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో జిల్లా అధ్యక్షుడు నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. గడిచిన ఆసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని చాటింది. మొత్తం 14 సీట్లలో 12 చోట్ల విజయం సాధించింది.జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మధుసూదన్ రెడ్డి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించారు. జిల్లాలోని మహబూబ్‌ నగర్‌, దేవరకద్ర, జడ్చర్లలో కాంగ్రెస్‌ పార్టీనే గెలిచింది. డిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన మధుసూదన్ రెడ్డి ఆ పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చాడని టాక్ కూడా ఉంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్ల , మహబూబ్ నగర్ , దేవరకద్ర మూడు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు . ఇలాంటి సమయంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ అందరినీ సమన్వయ పరుస్తూ, ప్రతిపక్షాలు ప్రభుత్వం పై చేసే విమర్శలను తిప్పికొడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే, సమర్దుడైన సత్తా గల నాయకుడి కోసం టీ పీసీసీ వెతుకుతున్నట్లు సమాచారం.ముప్పై ఏండ్ల నుంచి పార్టీకి విధేయతగా పనిచేస్తూ, పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా, కష్టాల్లో, నష్టాల్లో పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న అనేకమంది పార్టీ సీనియర్ నాయకులు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.

ఈ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలలోని పార్టీ ప్రముఖులు పలువురు ఆశిస్తుండడంతో పార్టీ అధిష్టానానికి అధ్యక్షుడి ఎంపిక ఓ సవాల్ మారింది. పదవిని ఆశిస్తున్న వారంతా అంగబలం, అర్థబలం ఉన్న వారే కావడంతో అందరినీ మెప్పించి, ఒప్పించి వారిలో ఒక్కరిని అధ్యక్షుడిగా ఎంపికచేయడం పీసీసీకి తలకు మించిన భారంగా మారిందట.మహబూబ్ నగర్ జిల్లాలో గల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులనే జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని అధిష్ఠానం పై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఓటు బ్యాంకు ఉన్న మూదిరాజ్ సామాజిక వర్గంలో బలమైన నాయకుడు సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేష్, జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం వర్గంలోని జహీర్ అక్తర్, రబ్బానీ, సిరాజ్ ఖాద్రీ ల పేర్లు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. కాగా, ఇప్పటికే పార్టీ అధిష్ఠానం, కొన్ని పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో టీపీసీసీ చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.మొత్తంగా డీసీపీ నుంచి ఆరడజను మంది నేతలు పోటీ పడుతుండటంతో.. పార్టీ హైకమాండ్‌ ఎటు తేల్చుకోలేక పోతుదంట. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీసీసీ పదవి విషయంలో నేతల నుంచి అసంతృప్తు జ్వాలలు ఎగిసిపడకుండా బంతిని ఎమ్మెల్యేల కోర్టులోనే వదిలేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో డీసీసీ పీఠంపై కూర్చునే నేతలేవరో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు.

Read:Mumbai:క్లోజ్ కానున్న మూడు రకాల బ్యాంక్ అకౌంట్లు

Related posts

Leave a Comment