Lucknow:45 రోజుల్లో రూ. 30 కోట్ల లాభం

Lucknow

Lucknow:45 రోజుల్లో రూ. 30 కోట్ల లాభం:మహాకుంభమేళా చాలా మంది రాతల్ని మార్చేసింది. ఆన్ లైన్ లో వైరల్ అయిన మోనాలిసా భోంస్లే మాత్రమే కాదు.. ఇలా బయటకు తెలియని చాలా మంది సూపర్ స్టార్లు అయ్యారు. కోట్లకు కోట్లు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఒకరు బోటు యజమని. ఆయన నెరన్నరలో ఏకంగా ముఫ్పై కోట్ల రూపాయలు సంపాదించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా సందర్భంగా జరిగిన భారీ ఆర్థిక కార్యకలాపాలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరించారు.

45 రోజుల్లో రూ. 30 కోట్ల లాభం

లక్నో మార్చి 6
మహాకుంభమేళా చాలా మంది రాతల్ని మార్చేసింది. ఆన్ లైన్ లో వైరల్ అయిన మోనాలిసా భోంస్లే మాత్రమే కాదు.. ఇలా బయటకు తెలియని చాలా మంది సూపర్ స్టార్లు అయ్యారు. కోట్లకు కోట్లు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఒకరు బోటు యజమని. ఆయన నెరన్నరలో ఏకంగా ముఫ్పై కోట్ల రూపాయలు సంపాదించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా సందర్భంగా జరిగిన భారీ ఆర్థిక కార్యకలాపాలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరించారు. వివిధ రంగాలలో 3 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. పడవ నడిపే కుటుంబం ఎంత సంపాదించిందో యోగి ఆదిత్యనాథ్ వివరించారు. 130 పడవలను నిర్వహిస్తున్న ఒక కుటుంబం 45 రోజుల్లో రూ. 30 కోట్ల లాభం ఆర్జించిందని, ప్రతి పడవ రోజుకు యాభైవేలకుపైగా సంపాదించారని తెలిపారు.

45 రోజుల్ వారు 30 కోట్లు లాభం పొందారు.. అంటే ప్రతి పడవ రూ. 23 లక్షలు సంపాదించిందని సీఎం తెలిపారు. మహా కుంభ్‌కు ప్రభుత్వం రూ.7,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. పన్నుల రూపంలో అంత కంటే ఎక్కువగా వచ్చాయని సీఎం తెలిపారు. మహా కుంభ్ ద్వారా మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పించామని 14 ఫ్లైఓవర్లు, తొమ్మిది అండర్‌పాస్‌లు ,12 కారిడార్లు నిర్మించామన్నారు. భారత జీడీపీ వృద్ధికి ఇవన్నీ ఉపయోగపడతాయన్నారు. అయితే మహాకుంభ్‌లో జరిగిన ఖర్చు ఎక్కువగా ఆహారం, నిత్యావసరాలు, పడవ ప్రయాణాలు, స్థానిక కొనుగోళ్లు, నమోదుకాని చిన్న వ్యాపారాల ద్వారా జరిగిందని నిపుణులు చెబుతున్నారు. వీటి ద్వారా జీఎస్టీ రాదని అంటున్నారు. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం సంగతి క్కన పెడితే ఆహారం, నిత్యావసరాలు, పడవ ప్రయాణాలు, స్థానిక కొనుగోళ్లు, నమోదుకాని చిన్న వ్యాపారాలను చేసుకుంటున్న వారు మాత్రం పెద్ద ఎత్తున లాభపడ్డారని అర్థం చేసుకోవచ్చు. కొన్ని పడవల ద్వారానే కోటీశ్వరుడు అయ్యారంటే.. మిగిలిన వ్యాపారులు కూడా అదే స్థాయిలో సంపాదించి ఉంటారని.. ఎన్నో వేల మంది జీవితాలను మహాకుంభ్ మార్చేసి ఉంటుందని అంటున్నారు.

Read more:Hyderabad:మహిళా ఉద్యోగులకు ఫుల్ డిమాండ్

Related posts

Leave a Comment