Loan waiver app | అందుబాటులోకి రుణమాఫీ యాప్ | Eeroju news

Loan waiver app

అందుబాటులోకి రుణమాఫీ యాప్

వరంగల్, ఆగస్టు 28 (న్యూస్ పల్స్)

Loan waiver app

రుణమాఫీలో ఉన్న సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులై ఉండి వివిధ కారణాలతో రుణమాఫీ కాని వారిని గుర్తించేందుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్‌ను తీసుకొచ్చింది ప్రభుత్వం.వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్‌ క్షేత్రస్థాయి సిబ్బందికి పంపించారు. యాప్‌లో వివరాలు ఎలా నమోదు చేయాలో కూడా ట్రైనింగ్ ఇచ్చారు. అర్హులై ఉండి రుణమాఫీ కాని వారి ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుంటారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి సంతకం పెట్టి ఇస్తారు.

ఇందులో భాగంగానే మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో వ్యవసాయశాఖ సర్వే చేయనుంది. ముందుగా ప్రయోగాత్మకంగా రైతుల వివరాలు నమోదు చేయనున్నారు. సమస్యలుంటే పరిష్కరించుకున్న తర్వాత పూర్తిస్థాయి సర్వే చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటికే చాలా మంది రైతులు తమకు రుణమాఫీ కాలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల ఫిర్యాదులు పరిశీలించిన అధికారులు.. రేషన్ కార్డు లేకపోవడం, కుటుంబ వివరాలు సరిగా నమోదు కాకపోవడంతో మాఫీ కాలేదని తేల్చారు. అందుకే ఇలా నేరుగా వెళ్లి వివరాలు నమోదు చేసి మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ముందుగా ఫిర్యాదులు వచ్చిన రైతుల ఇంటికి అధికారులు వెళ్తారు. రుణఖాతాలు, రేషన్‌ కార్డు, ఆధార్‌, ఇతర పత్రాలు పరిశీలిస్తారు. కుటుంబ సభ్యుల వివరాతీసుకుంటారు. వారి ఫొటోలు తీసుకుంటారు. వాటి ఆధారంగా రుణమాఫీకి సంబంధించిన వివరాలు, ఫోన్‌నెంబర్‌తో ధ్రువీకరణ పత్రాన్ని రూపొందించి కుటుంబ యజమానితో సంతం తీసుకుంటారు. దీన్ని పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించాల్సి ఉంటుంది. దీని ప్రకారం అర్హులైన వారిని గుర్తించి రైతులకు రుణమాఫీ చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.

Loan waiver app

 

Ongoing loan waiver challenges | కొనసాగుతున్న రుణమాఫీ సవాళ్లు… | Eeroju news

Related posts

Leave a Comment