Liquor sales | శివారు గ్రామాల్లో తగ్గన మద్యం అమ్మకాలు | Eeroju news

శివారు గ్రామాల్లో తగ్గన మద్యం అమ్మకాలు

శివారు గ్రామాల్లో తగ్గన మద్యం అమ్మకాలు

విజయవాడ, అక్టోబరు 22, (న్యూస్ పల్స్)

Liquor sales

ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలె ప్రైవేట్ మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. కస్టమర్లకు నచ్చిన మద్యం విక్రయిస్తున్నారు. ఏపీలో నాణ్యమైన మద్యం దొరుకుతుండడంతో సరిహద్దు గ్రామాల్లోని తెలంగాణ వైన్ షాపుల్లో మద్యం విక్రయాలు తగ్గినట్లు తెలుస్తోంది.ఏపీలో మందుబాబులు… ఎన్నాళ్లో వేచిన ఉదయం, ఈనాడే ఎదురవుతుంటే అంటూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కళ్ల ముందు క్వాలిటీ మద్యం కనిపిస్తుంటే ఆ ఆనందం చెప్పలేనంత అంటున్నారు. అయితే ధరల విషయం మాత్రం మందుబాబులు కాస్త అసంతృప్తితో ఉన్నారు. క్వాలిటీ మద్యం అయితే దొరుకుతుంది కానీ ధరలు మాత్రం తగ్గలేదంటున్నారు. మరికొన్ని రోజుల్లో మద్యం ధరలు తగ్గుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఏపీలో ఇటీవల కొత్త మద్యం పాలసీ ప్రారంభం అయ్యింది. వైసీపీ హయాంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి, ప్రైవేట్ వారికి లాటరీ విధానంలో అందించింది కూటమి ప్రభుత్వం. ప్రైవేట్ మద్యం షాపుల నుంచి ప్రభుత్వానికి భారీగానే ఆదాయం వస్తుంది.రెండేళ్ల పాటు కొత్త మద్యం పాలసీ అమల్లో ఉంటుంది. ఇక మద్యం షాపులు దక్కించుకున్న వారికి సిండికేట్ల బాధ తప్పడంలేదు. ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు వాటాలు ఇవ్వాలన్సి పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. మద్యం లాభసాటి వ్యాపారం కాబట్టి షాపులు దక్కించుకున్న వారు…వాటాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు నాసిరకం మద్యం తాగలేక పక్క రాష్ట్రాల వైపు చూసేవాళ్లమని, ఇక ఏపీలోనే నాణ్యమైన మందు దొరుకుతుందంటున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా తెలంగాణ నుంచి ఏపీకి వస్తుంటే…ఫలానా మద్యం తీసుకురా అని చెప్పేవారమని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందంటున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామాల వారు… బోర్డర్ దాటి వెళ్లి బ్రాండెడ్ మద్యం తాగివచ్చే వారు. దీంతో తెలంగాణలో బ్రాండెడ్ బ్రాండ్ల మద్యం అమ్మకాలు జోరుగా సాగేవి. గత వారం రోజులుగా తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో మద్యం అమ్మకాలు మునుపటి కంటే కాస్త తగ్గాయని వ్యాపారులు అంటున్నారు.ఏపీ సరిహద్దు గ్రామాల్లోని తెలంగాణ మద్యం షాపుల్లో నిత్యం రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు అదనపు లిక్కర్ విక్రయాలు జరిగేవి. ఏపీలో కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రావడం, బ్రాండెడ్ మద్యం దొరుకుతుండడంతో బోర్డర్ సమీపంలోని తెలంగాణ మద్యం షాపుల్లో విక్రయాలు కాస్త తగ్గాయని సమాచారం.

తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని సత్తుపల్లి, ఆశ్వారావుపేట, భద్రాచలం, మధిర, కోదాడ, హుజుర్‌నగర్‌, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాలలో మద్యం విక్రయాలు మందగించాని తెలుస్తోంది. కోదాడ, హుజుర్‌నగర్‌ నియోజకవర్గాల్లో సరిహద్దు ప్రాంతంలో 12 మద్యం దుకాణాలు ఉండగా… ఒక్కో షాపులో రోజుకు రూ1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఏపీ మందుబాబు బ్రాండెడ్‌ మద్యాన్ని విక్రయించేవారు. ఈ లెక్కన అన్ని షాపుల్లో రోజుకు రూ.24 లక్షలు, నెలకు రూ.7 కోట్ల పైగా ఏపీ మందుబాబులు మద్యం కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఈ విక్రయాలు తగ్గాయని అక్కడి వ్యాపారులు అంటున్నారు.

ఏపీ, తెలంగాణలో మద్యం ధరలు పొలిస్తే… ప్రస్తుతం ఏపీలోనే మద్యం ధరలు అధికంగా ఉన్నాయి. క్వార్టర్ లో రూ.10 నుంచి 20, ఫుల్ రూ.50 నుంచి రూ.100 ఏపీలో అధికంగా ఉన్నాయి. అయితే ఇన్నాళ్లు మద్యం నాణ్యత బాగోలేక, తెలంగాణ సరిహద్దు గ్రామాలకు వెళ్లి అక్కడ మద్యం కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఏపీలో నాణ్యమైన మద్యం దొరుకుతుండడంతో… ఖర్చును లెక్కచేయడంలేదు మద్యం ప్రియులు. ఇదిలా ఉంటే త్వరలోనే తెలంగాణ కూడా మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నారు. క్వార్టర్ రూ.20, బీరుపై రూ.10 పెంచే యోచనలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉందని తెలుస్తోంది. ఏపీలో ఈనెల 26వ తేదీ తర్వాత మద్యం ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

శివారు గ్రామాల్లో తగ్గన మద్యం అమ్మకాలు

New liquor policy after Dussehra | దసరా తర్వాతే మద్యం కొత్త పాలసీ… | Eeroju news

Related posts

Leave a Comment