శ్రీశైలం మండలం సుండిపెంటలో చిరుతపులి
శ్రీశైలం
Leopard in Sundipenta Srisailam mandal
శ్రీశైలం మండలంలో సుండిపెంటలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో రామాలయం దేవాలయం సమీపంలోని ఓ గృహంలోకి ప్రవేశించి రెండు పెంపుడు కుక్కలను చంపి ఎత్తుకెళ్లింది. అర్ధంరాత్రి 10 దాటిన తర్వాత చిరుత ఇంటి ఆవరణంలోనికి ప్రవేశించి ఒక కుక్కను అక్కడే చంపివేసి మరొక కుక్కను నోట కరచి తీసుకేలుతున్న దృశ్యాలను ఉదయం సీసీ కెమెరాలు గుర్తించారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం తెలిపారు.
కాగా శ్రీశైలం మండలం సుండిపెంటలో ఇప్పటికె శివారు ప్రాంతాల్లోనే చిరుత సంచరిస్తూ కుక్కలను చంపివేసిన ఘటనలు అనేకం చోటు చేసుకుంటే ప్రస్తుతం గ్రామంలోని రామాలయం దేవాలయం సమీపంలో సంచరించటం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. అటవీశాఖ అధికారులు అటవీప్రాంతం దగ్గరలో ఉండటంతో అర్ధరాత్రి సమయంలో చిరుతలు బయటకు వస్తున్నాయని ప్రజలు రాత్రి సమయాల్లో బయటకు వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Polavaram | ఇక పోలవరం పరుగులే… | Eeroju news