Lavanya in Suicide Attempt | సూసైడ్ అటెంప్ట్ లో లావణ్య | Eeroju news

Lavanya in Suicide Attempt

 సూసైడ్ అటెంప్ట్ లో లావణ్య

హైదరాబాద్, జూలై 13, (న్యూస్ పల్స్)

Lavanya in Suicide Attempt

టుడు రాజ్‌తరుణ్‌ ప్రేమ కేసులో లావణ్య పెట్టిన మెసేజ్‌ సంచలనంగా మారుతోంది. చచ్చిపోతున్నానంటూ ఓవైపు లాయర్‌కు మెసేజ్ చేసిన ఆమె… డయల్‌ 100కు ఫోన్ చేసి ఇదే విషయం చెప్పారు. తన చావుకు రాజ్‌తరుణ్, మాల్వీ ఫ్యామిలీయే కారణమని చెప్పారు. నటుడు రాజ్‌తరుణ్‌ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు లావణ్య పెట్టిన మెసేజ్ అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. తాను చచ్చిపోతున్నానంటూ లాయర్‌, పోలీసులకు ఒకేసారి సమాచారం ఇచ్చిన లావణ్య టెన్షన్ పెట్టారు. ముందు లాయర్‌తో కేసు విషయంలో చాటింగ్ చేస్తూ తాను వెళ్లిపోతున్నానంటూ మెసేజ్ చేశారు. రాజ్‌తరుణ్ లేకుండా తాను జీవించలేనని మెసేజ్ చేసిన లావణ్య ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నానంటూ చెప్పుకొచ్చారు.

ఆ మెసేజ్ చూసిన లాయర్ షాక్ అయి వెంటనేపోలీసులు సమాచారం ఇచ్చారు. ఇంతలో డయల్ 112 నుంచి కూడా నార్సింగ్ పోలీసులకు మరో సమాచారం వచ్చింది. తన మెసేజ్‌లో లావణ్య ఏం చెప్పారంటే…”నేను రాజ్ తరుణ్ భార్య లావణ్యని. నన్ను క్షమించండి. నా కోసం ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేనూ ఏంటో తెలిసిన జనం నన్ను తప్పు అన్నారు. తెలియని మనుషులు నాకోసం సహాయం చేశారు.

రాజ్ లేని జీవితం నేను ఉండలేను. బ్రతకలేను. ఈ ప్రపపంచంలో నేను ఉండలేను. నేను అన్నీ కోల్పోయాను. నేను వ్యవస్థను నమ్మాను కానీ నేను విఫలమయ్యాను. నేను మోసపోయాను. మైండ్ గేమ్‌లు, గాసిప్స్‌తో విసిగిపోయారు. నేను ఇందులో గెలవకపోవచ్చు కానీ నేను ఇప్పటికీ దేవుణ్ణి నమ్ముతాను నాకు ఇలా చేసిన వ్యక్తులను కచ్చితంగా దేవుడు చూస్తాడు. మస్తాన్ కేసు తర్వాత ప్రతిదీ ప్లాన్ ప్రకారంతో నాతో ఆడారు. నేను మాల్వీ మల్హోత్రాని అభ్యర్థించి, వేడుకున్న పట్టించుకోలేదు. మాకూ తిన్నడానికీ తిండి లేదూ అని అడుక్కుంది అంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

రాజ్ పేరెంట్స్ కూడా ఒక ముఖ్య కారణం. రాజ్ మారిపోయాడు. అతను నా చావు కోరుకున్నాడు. నా చావుకు మాల్వీ మల్హోత్రా ప్రధాన కారణం. నా కుటుంబ సభ్యులకు, దిలీప్ కల్యాణ్‌కి మీడియాకు నా హృదయపూర్వక క్షమాపణలు. నన్ను క్షమించండి. అంటూ లావణ్య మెసేజ్ చేశారు. డయల్ 112కు ఫోన్ చేసిన లావణ్య… తాను చనిపోతున్నట్టు చెప్పారు. రాజ్‌తరుణ్ లేని జీవితాన్ని ఊహించుకోలేనని అన్నారు. తన చావుకు రాజ్‌తరుణ్‌ ఫ్యామిలీతోపాటు హిరోయిన్ మాల్వీ మల్హోత్రా ఫ్యామిలీ కారణమని పోలీసులకు చెప్పారు. ఈ సమాచారంతో పోలీసులు పరుగులు పెట్టారు.

 

Lavanya in Suicide Attempt

 

Twist in Raj Tarun’s case… | రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్… | Eeroju news

Related posts

Leave a Comment