Kurnool | బెగ్గర్ మాఫియా…. | Eeroju news

బెగ్గర్ మాఫియా....

బెగ్గర్ మాఫియా….

కర్నూలు, నవంబర్ 22, (న్యూస్ పల్స్)

Kurnool

Begging: A Lucrative Business? A Mafia? – Mohammed Zameerచిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వారితో బిచ్చమెత్తించి ఆ డబ్బులు తాము వాడుకునే రాక్షసుల గురించి సినిమాల్లోనే చూసి ఉంటాం. కానీ నిజంగానే అలాంటి మాఫియా ఉంది. ఏపీలో ఇలాంటి మాఫియాను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. చిన్న పిల్లవాడు ఒంటి నిండా రంగు పూసుకుని గాంధీ అవతారంలో రోడ్డుపై కునికి పాట్లు పడుతున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో చూసి నారా లోకేష్ చలించిపోయారు. వెంటనే ఎవరో ఏంటో తెలుసుకోవాలని.. ఎందుకు అలా భిక్షాటన చేయాల్సి వస్తుందో గుర్తించాలని ఆదేశించారు. కర్నూలులో ఆ పిల్లవాడి కోసం వెదుకుతున్న పోలీసులకు అలాంటి వారు చాలా చోట్ల కనిపించారు.

శ‌రీరానికి రంగు పూసుకుని భిక్షాట‌న చేస్తున్న మ‌రి కొంద‌రు చిన్నారుల‌ను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, వివ‌రాలు సేక‌రించారు. అంతా Growing Menace of Begging Mafia in Hyderabadవ్యవస్థీకృతంగా జరుగుతున్న మాఫియాగా గుర్తించారు. ఆ పిల్లల తల్లిదండ్రులను గుర్తించి వారికి అప్పగించారు. అయితే ఈ బిచ్చగాళ్ల మాఫియా వెనుక ఉన్నది ఎవరో బయటకు లాగేందుకు ఆపరేషన్ ప్రారంభించారు.నిజానికి ఒక్క కర్నూలులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి బిచ్చగాళ్ల మాఫియాలు ఉంటాయి. అన్ని రకాల వయసుల వాళ్లు ఇందులో ఉంటారు. చంటి బిడ్డలను వేసుకుని కొంత మంది మహిళలు రోడ్డు మీదకు వస్తారు.

నిండు గర్భిణి వేషంతో మరికొంత మంది వస్తారు. రూపాయి చేయని పెన్నును పది రూపాయలు పెట్టి కొనాలని దీనంగా అడిగేవారూ ఉంటారు. ఇదంతా ఓ బెగ్గింగ్ మాఫియా అని చాలా మందికి తెలుసు. అయినా కొంత మంది డబ్బులు ఇస్తూంటారు. పోలీసులు పట్టించుకోరు. ఈ మాఫియాను నడిపే వ్యక్తులు లక్షలు వెనకేసుకుంటూ ఉంటారు. పిల్లల్ని పావులుగా పెట్టుకుంటూ ఉంటారు. బెగ్గర్లు లక్షాధికారులుగా ఉన్నారని అనేక చోట్ల నుంచి వార్తలు వస్తున్నాయి.

ముంబైలో ఒక్కో బెగ్గర్ లక్షలు సంపాదిస్తారు. లక్నోలో బెగ్గర్లకు ఐ ఫోన్లు కూడ ఆంటాయి. అక్కడ ఓ మాఫియాలాగా వ్యవస్థీకృతంగా ఉందో లేదో ఏపీలో మాత్రం పిల్లల జీవితాలను నాశనం చేస్తూ.. ఏమీ తెలియని వయసులో కూడా వారి ఒంటికి రంగులేసి భిక్షాటనకు పంపుతున్నారు. ఈ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి.

బెగ్గర్ మాఫియా....

Telangana | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి సవాలు విసిరిన కేటీఆర్ | Eeroju news

Related posts

Leave a Comment