KTR vs. Sitakka | కేటీఆర్ వర్సెస్ సీతక్క | Eeroju news

KTR vs. Sitakka

కేటీఆర్ వర్సెస్ సీతక్క

హైదరాబాద్, జూలై 31

KTR vs. Sitakka

KTR vs. Sitakkaతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందుకోసం బుధవారం కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ప్రస్తుతం ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై సభ్యుల మధ్య వాడీవేడిగా చర్చ మొదలైంది. మొదట బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ చర్చను ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో తెలంగాణ చీకట్లో నిండిపోతుందని సరిగ్గా పదేళ్ల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అలాగే తెలంగాణ వారికి పాలించే సత్తా ఉందా అని ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది అన్నారని గుర్తు చేశారు. అలాగే ఈ పదేళ్లల్లో రాష్ట్ర సంపద పెరిగిందని గతంలో భట్టి విక్రమార్క చెప్పారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారన్నారు.

బడ్జెట్‌లోని అంశాలు మేనిఫెస్టో లేవని కేటీఆర్ విమర్శలు చేశారు. తెలంగాణ బడ్జెట్ అద్భుతంగా ఉందని ఆర్‌బీఐ చెబుతుందని, రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో అప్పగించామన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై విస్తృతంగా చర్చ జరగాలని, అవసరమైతే అర్ధరాత్రి వరకు చర్చ జరపాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. మీ హయాంలో అర్హత లేనివారికి పథకాలు ఇచ్చారన్నారు. మీరు పదేళ్లుగా చేయని పనులు చేసి చేపిస్తున్నామన్నారు.

గత పదేళ్లు బీఆర్ఎస్ పాలన కోట శ్రీనివాస్ కోడి కూర కథలాగా ఉండేదన్నారు. లక్షల మంది పేదలు ఇళ్లు లేక బాధపడుతున్నారని, బీఆర్ఎస్ పదేళ్లలో ఎవరికి ఇళ్లు ఇచ్చిందో చెప్పాలన్నారు. ఉద్యోగ విషయంలో కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. మేం ప్రకటించిన పథకాలకు కొంత పెంచి ప్రకటించారని, అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా ? అని ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో ప్రజలు సంతో షంగా ఉన్నారన్నారు. త్వరలోనే ఇచ్చిన ప్రతి హామీలను నెరవేరుస్తామన్నారు. అబద్ధాలను సైతం అద్భుతంగా చెప్పడంలో కేటీఆర్ దిట్ట అని మంత్రి సీతక్క సెటైర్ వేశారు.

పదేళ్లుగా ఉద్యోగాలు ఇస్తే..ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. డబుల్ పెన్షన్ తీసుకుంటున్న లక్ష్మ్మ నుంచి రికవరీ చేశారని, ఈ విషయం మా దృష్టికి రాలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్ చైర్మన్లు కూడా పెన్షన్ తీసుకున్నారన్నారు. సాగు చేసుకుంటున్న రైతులకు ధరణిలో పేరు లేదని రైతుబంధు నిలిపివేశారన్నారు. ప్రతిరోజు ధనిక రాష్ట్రం, బంగారు తెలంగాణ అంటే..బయట ఉన్నా మేము నిజమేనని అనుకున్నామన్నారు. బీఆర్ఎస్ జరుగుతున్న అవినీతిని తట్టుకోలేక ప్రజలు మాకు అధికారం ఇచ్చారన్నారు.

KTR vs. Sitakka

 

Full responsibilities of KTR K | కేటీఆర్ కే పూర్తి బాధ్యతలు | Eeroju news

Related posts

Leave a Comment