గొర్రెల స్కామ్ లో కేటీఆర్ పీఏ ?
కరీంనగర్, జూలై 17 (న్యూస్ పల్స్)
KTR PA in scam?
బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కాములపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. వాటిలో ముఖ్యంగా గొర్రెల స్కాంపై ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి లింక్స్ బయటకు వచ్చినట్టు సమాచారం. 700 కోట్ల స్కాంలో తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఎక్కడ దొరికితే అక్కడ దోచేశారు. మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్, సీఈఓ రాంచందర్ అరెస్ట్ తర్వాత కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందుకు కళ్యాణ్ కుమార్ డేటా లిస్టులో తిరుపతి పేరు ఉండటం కేటీఆర్ వర్గాన్ని కలవరపెడుతోందిసిరిసిల్ల జిల్లాకు చెందిన రాజు అనే కాంట్రాక్టర్కి అప్పగించడంలో తిరుపతి పాత్ర చాలా ఉందని ఏసీబీ అధికారులు డేటా సేకరించారు. అయితే, డబ్బులు ఎంత చేతులు మారాయి.
ఒక్క సిరిసిల్లలోనే వేలు పెట్టాడా? తన సొంత జిల్లా అయిన జగిత్యాలలో కూడా స్కాంకు సహకరించాడా అనేది అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం కోటి రూపాయలకు పైగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఆ లబ్ధిదారుల వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబర్స్తో పాటు బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. జిల్లాల వారీగా లబ్ధిదారులకు అమ్మిన యజమానుల డేటాలో డబ్బులు ఎలా చేరాయి. మళ్లీ వీరి ఖాతాలోకి ఎలా వచ్చాయో పూర్తి వివరాలు ఉన్నట్లు సమాచారం. గొర్రెల కాంట్రాక్టర్ రాజు నుంచి ఇతనికి డబ్బులు చేరిన విషయాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది.
కేటీఆర్కు అన్నీ తానై చూసుకునే తిరుపతికి చివాట్లు పెట్టినట్లు అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకు తెలియకుండా ఇంకా ఏం చేశారోనని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. గొర్రెల స్కాంలో డబ్బులు తినడంపై తనకు చెడ్డపేరు వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. గతంలో గ్రూప్ 1 లీకేజీ విషయంలో తిరుపతి తీరుపై అనుమానాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ల ప్రభుత్వమే ఉండటంతో కప్పిపుచ్చుకున్నారని, ఇప్పుడు ఒక్క కేసులో నిందితుడిగా మారితే తవ్వేకొద్దీ అక్రమాలు, అవినీతి బయటపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
కేటీఆర్ పేరు చెబుతూ గతంలో ఓఎస్డీ మహేందర్ రెడ్డి అధికారులపై పెత్తనం చెలాయించారు. ఫైల్స్ క్లియరెన్స్కి ఓ లెక్క ఉండేదని చెబుతుంటారు. కంఫర్డ్ ఐఏఎస్ ఇంటర్వ్యూల ఫైల్లో కూడా ఇన్వాల్ అయి ఆయన పాత్ర ఏంటో నిరుపించుకున్నారు. ఇప్పుడు తిరుపతి కూడా స్కాముల్లో ఇరుక్కుంటాడని తెలుస్తుండటంతో కేటీఆర్ జాగ్రత్తలు తీసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.
Does KTR have amnesia | కేటీఆర్ కు మతిమరుపు ఉందా | Eeroju news