కొండా సురేఖకు కోర్టుక్లాస్
హైదరాబాద్, అక్టోబరు 26, (న్యూస్ పల్స్)
Konda Surekha
కేటీఆర్ పిటిషన్‌పై సిటీ సివిల్ కోర్టు విచారణ జరిపింది. కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు వేయగా..ఈ పిటిషన్‌పై సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కూడా కొండా సురేఖకు ఆదేశాలిచ్చింది. విచారణలో భాగంగా బాధ్యత కలిగిన పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కోర్టు పేర్కొంది. అందులోనూ ఒక ప్రజా ప్రతినిధి నుంచి ఇలాంటి మాటలు రావడం తీవ్ర అభ్యంతకరం అని తెలిపింది.
అలాంటి వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయంది. మరోసారి కేటీఆర్‌పై అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. ఆమె వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, ఇతర ప్లాట్‌ఫామ్‌ల నుంచి వెంటనే తొలగించాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతే కాకుండా కేటీఆర్ పై కొండా సురేఖా చేసిన వ్యఖ్యలకు సంబంధిన వీడియోలను కూడా సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఈ నెల 27 వరకు వాయిదా వేసింది.
కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత భావోద్వేగం..|Samantha is emotional on Konda Surekha’s comments..