Komuravelli:కొమురవెళ్లిలో శివరాత్రి శోభ

Komuravelli Shivratri sobha

Komuravelli:కొమురవెళ్లిలో శివరాత్రి శోభ:తెలంగాణ జానపద సంస్కృతి, సంప్రదాయంనికి పుట్టినిల్లుగా విరాజిల్లుతు కొండసారికాల్లో వెలసిన కోరమిసల మల్లన్న భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది కొమురవెళ్లి క్షేత్రం.

కొమురవెళ్లిలో శివరాత్రి శోభ

కొమురవెళ్లి
తెలంగాణ జానపద సంస్కృతి, సంప్రదాయంనికి పుట్టినిల్లుగా విరాజిల్లుతు కొండసారికాల్లో వెలసిన కోరమిసల మల్లన్న భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది కొమురవెళ్లి క్షేత్రం.
మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి 26 అర్థరాత్రి ఆలయ సంప్రదాయం ప్రకారం లింగోధ్బోవ కాలంలో మల్లన్న గర్భగుడిలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు ఆలయ అర్చకులు .అదే సమయాన ఆలయ తోటబావి ప్రాగణంలో ఒగ్గుపూజరులచే(యాదవులు) పసుపు, కుంకుమ, తెల్లపిండి, పచ్చపిండి,సున్నేరు పంచారంగులతో స్వామివారి పెద్దపట్నన్ని 41 వరుసలతో ఏర్పాటు చేస్తారు.

మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా కొమురవెళ్లి మల్లన్న ఆలయానికి తెలంగాణ జిల్లాల నుండి కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం, వసతి సౌకర్యం, ప్రసాదాల లభ్యత లేకుండా ,శివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి వసతి, క్యూ లైన్లో ఇబ్బందులు,పార్కింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు భక్తులు పెద్దపట్నాన్ని చూడడానికి వీలుగా ఏర్పాట్లు పూర్తి చేశామని అలాగే మంగళవారం అర్థరాత్రి నిర్వహించే పెద్దపట్ననికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఒగ్గుపూజరుల సహాయంతో చేశామని ,ప్రభుత్వ శాఖల అధికారులు,పోలీసుల సహకారంతో మహఘట్టమైన పెద్దపట్నం వద్ద ఎలాంటి అసౌకర్యం ,అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఆలయ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని వారు ఆలయ అధికారులు తెలిపారు.

Read more:Kumbh Mela:చివరి దశకు కుంభమేళ

Related posts

Leave a Comment