Kolkata | కోలకత్తా ఆస్పత్రిలో 50 మంది డాక్టర్లు రాజీనామా | Eeroju news

కోలకత్తా ఆస్పత్రిలో 50 మంది డాక్టర్లు రాజీనామా

కోలకత్తా ఆస్పత్రిలో 50 మంది డాక్టర్లు రాజీనామా

కోల్ కత్తా, అక్టోబరు 9, (న్యూస్ పల్స్)

Kolkata

కొల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జరిగిన మెడికల్ విద్యార్థి ఆత్యచార ఘటన దేశ వ్యాప్తంగా దూమారం రేపింది. ఈ ఘటనపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో తీవ్రంగా నిరసన తెలిపారు. వారి నిరసనకు సీఎం మమతా బెనర్జీ దిగి వచ్చిన వారి కోపం తగ్గాలేదు. ఈ ఘటనలో తాజాగా మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

ఈ ఘటనను నిరసిస్తూ జూనియర్‌ వైద్యులు నిరాహార దీక్షకు పూనుకున్నారు. తాజాగా ఈ దీక్షకు సీనియర్‌ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు తమ మద్దతును తెలిపారు. ఈ నేపథ్యంలో 15 మంది జూనియర్‌ వైద్యులు నిరాహార దీక్షల్లో పాల్గొని సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. ఆర్‌జీ కర్ ఆసుపత్రిలోని 50 మంది సీనియర్ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

ప్రస్తుతం వీరు వారి రాజీనామ పత్రాలపై సంతకం చేస్తున్న వీడియో నెటింట్లో ట్రెండింగ్‌గా మారింది.ఆగస్టు 9న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో ఓ వైద్య విద్యార్థి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితులని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన 12 గంటల నిరాహారదీక్షను జూనియర్ డాక్టర్లు ప్రకటించారు.

వారిలో ఆరుగురు ‘నిరవధిక’ నిరాహార దీక్షకు కూర్చుంటారని ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఈ మార్చ్‌కు పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వనప్పటికీ, సాయంత్రం సెంట్రల్ కోల్‌కతా కాలేజీ స్క్వేర్ నుంచి నిరసన వేదిక ధర్మతల వరకు సింబాలిక్ ర్యాలీని నిర్వహించడానికి జూనియర్ వైద్యులు సిద్ధమవుతున్నారు.

కోలకత్తా ఆస్పత్రిలో 50 మంది డాక్టర్లు రాజీనామా

MLA Kolikapudi Srinivas | కొలికపూడి మాకు వద్దంటూ… టీడీపీకి పంచాయితీ | Eeroju news

Related posts

Leave a Comment