Kodali Nani VS Vallabhaneni | లైట్ తీసుకున్న కొడాలి… వల్లభనేని | Eeroju news

Kodali Nani VS Vallabhaneni

లైట్ తీసుకున్న కొడాలి… వల్లభనేని

విజయవాడ, అక్టోబరు 1, (న్యూస్ పల్స్)

Kodali Nani VS Vallabhaneni

శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీని కుదిపేస్తుంది. అసలే ఓటమి భారం ఒకవైపు.. మరోవైపు కీలక నేతల వలసలతో కుంగిపోతున్న ఆ పార్టీ తిరుమల వ్యవహారంలో తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి నానా పాట్లు పడుతుంది. దానిపై రెండు సార్లు మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం జగన్ తాను క్రిస్టియన్‌నని ఒప్పుకున్నారు. తిరుమలకు వస్తానని ప్రకటించిన ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టపడక ఏవేవో కారణాలు చెప్పి ఆ యాత్రను కాన్సిల్ చేసుకున్నారు. ఆ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు.. అయితే ఆయనకు వీరవిధేయులే దాన్ని పాటించకపోవడంపై పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

తిరుమల లడ్డూ కల్తీ వివాదం వ్యవహారం ముదురుతూ వైసీపీ అందరికీ టార్గెట్ అవుతుంది. దాంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు మొదలుపెట్టాలని చూశారు. తిరమల స్వామి వారిని దర్శనానికి వస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండ మీదకు వస్తే ఆయన్ను అధికారులు ఎవరూ డిక్లరేషన్‌ కోరలేదు. అప్పట్లో హిందూ సంఘాలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు చేసిన డిమాండ్లు ఎవరూ పట్టించుకోలేదు. బ్రహ్మోత్సవాలకు జగన్ వచ్చిన సమయంలో దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా నాటి ఛైర్మన్‌తో పాటు పలువురు మాజీ మంత్రులు విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ సారి డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే దర్శనం చేసుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపించింది.

జగన్ తిరుమల యాత్రకు తనకు అనుమతి లేదని నోటీసులు ఇచ్చారని ఇంకేవేవో కారణాలు చెప్పి యాత్రను కాన్సిల్ చేసుకున్నారు. అయితే వివిధ వర్గాల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో తన మతం గురించి ప్రస్తావించారు. గతంలో తాను హిందువునే అని చెప్పుకున్న జగన్.. ఇప్పుడు నాలుగు గోడల మధ్య తాను బైబిల్ చదువుతానని ఒప్పుకున్నారు.అయితే డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టపడని జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆ క్రమంలో ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని.. ఆ పూజల్లో వైసీపీ నేతలంతా పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని.. అందుకే పాప ప్రక్షాళన పేరుతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తామన్నారు వైసీపీ నేతలు.

వైసీపీలో జగన్ మనసెరిగి పనిచేసే నాయకులు చాలా మందే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడ జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చే వీరవిధేయులకు కొదవ ఉండేది కాదు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అలాంటి వారిలో ముందుండే వారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఓడిపోతున్నారని ఒకవేళ గెలిస్తే బూట్లు తుడుస్తూ ఆయన కాళ్ల దగ్గర పడుంటానని భీభత్సమైన ఛాలెంజ్ చేశారు .. అయితే ఫలితాల తర్వాత గుడివాడ ప్రజలకే పెద్దగా కనిపించడం మానేశారు. తాజాగా వైసీపీ జిల్లా సమీక్షా సమావేశానికి హాజరైన కొడాలి నాని సిట్ విచారణను తప్పుపడుతూ చంద్రబాబు, లోకేష్‌లపై విమర్శలు గుప్పించారు.జగన్‌ కోసమే పుట్టినట్లు ఉంటుంది కొడాలి నాని వ్యవహారతీరు .. ఎప్పుడూ బొట్టు పెట్టుకుని, మెడ నిండా రుద్రాక్షలతో కనిపించే ఆయన జగన్ పిలుపు మేరకు ఎక్కడా పూజలు చేయలేదు.

ఏ ఆలయాన్ని సందర్శించలేదు. ఇక మరో ముఖ్య నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ .. టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన వంశీ రెండో సారి గెలవగానే కొడాలి నాని వెంట వెళ్లి జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు .. ఇక ఆప్పటి నుంచి టీడీపీ అధినేతని టార్గెట్ చేస్తూ జగన్‌ పట్ల విధేయత చాటుకుంటూ వచ్చారు. గెలిచాక ఎవరికీ కనిపించకుండా పోయిన వంశీ కూడా తాజాగా కొడాలినానితో కలిసి వైసీపీ ఆఫీసులో కనిపించారు. ఆయన కూడా ఎక్కడా పూజలు నిర్వహించిన దాఖాలాలు కనిపించపోవడంతో వైసీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.తిరుమల వెంకటేశ్వరుడిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేక జగన్ ఏకంగా తన తిరుమల యాత్రనే రద్దు చేసుకున్నారు.

పాప ప్రక్షాళన పూజలకు తిరుమల వెళ్తానన్న ఆయనే దాన్ని క్యాన్సిల్ చేసుకోవడంతో కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా దాన్ని లైట్ తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తన తిరుమల యాత్ర రద్దు అయినా.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఆలయాల్లో పూజలు చేయాలని జగన్ సూచించారు. దాంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వైసీపీ నేతలు ఆలయాల్లో హడావుడి చేశారు.అయితే జగన్ ఆదేశాలను కొడాలి నాని, వల్లభనేని వంశీ కనీసం పట్టించుకోలేదు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన మెప్పు కోసం బూతులు, దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోయిన ఆ ఇద్దరు ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత పూర్తిగా మౌనం వహించారు. ఎంతో అత్యవసరమైతే తప్ప అసలు రాష్ట్రంలోనే కనిపించడం లేదు.

తాజాగా తాడేపల్లిలో జగన్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ రివ్యూ మీటింగ్ కు వారిద్దరు హాజరయ్యారు. ఆ సమావేశం తరువాత కొడాలి నాని మీడియాతో మాట్లాడినా ఆయన మాటల్లో మునుపటి ఫైర్ కనిపించలేదు. తెలుగుదేశం, చంద్రబాబుపై విమర్శలు చేయాలి కనుక చేస్తున్నా అన్నట్లుమాట్లాడి మమ అనిపించారు.వల్లభనేని వంశీ అయితే మీడియా ముందు నోరెత్తే ధైర్యం కూడా చేయలేదు. పక్కనున్న మాజీ మంత్రులు నానిలు ఇద్దరు మాట్లాడమని అడిగినా నో అనేశారు. తప్పక వచ్చినట్లు తాడేపల్లి నుంచి డైరెక్ట్‌గా హైదరాబాద్ వెళ్లిపోయారు. కనీసం సొంత నియోజకవర్గం గన్నవరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఓటమి తర్వాత సొంత నియోజకవర్గాల్లో కేడర్‌ని గాలికి వదిలేసిన ఆ ఇద్దరు ఇప్పుడు జగన్‌ విషయంలో కూడా డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అదే ఇప్పుడు కృష్ణా జిల్లా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Kodali Nani VS Vallabhaneni

 

Kodali, Vallabhaneni… jump..? | కొడాలి, వల్లభనేని… జంప్..? | Eeroju news

Related posts

Leave a Comment