నాని. ఈ పేరు తెలుగు స్టేట్స్‌లో చాలా ఫేమస్. ఆ పేరున్న నేతలు రాజకీయాల్లో రాణిస్తుండటంలో ఇంకా పాపులర్ అయింది నాని అనే పేరు. నామ్ చోటా హై.. సౌండ్ బడా హై అన్నట్లుగా..గత ఐదేళ్లలో నాని అనే పేరు ఏపీలో ఓ మోత మోగింది. ఏ న్యూస్ చూసినా..ఎవరిని ఎవరు విమర్శించుకున్నా..నాని అనే పేరు లేకుండా ఏపీ రాజకీయం నడవ లేదు.
పాపం.. నానిలు..
ఏలూరు, జనవరి 3
నాని. ఈ పేరు తెలుగు స్టేట్స్‌లో చాలా ఫేమస్. ఆ పేరున్న నేతలు రాజకీయాల్లో రాణిస్తుండటంలో ఇంకా పాపులర్ అయింది నాని అనే పేరు. నామ్ చోటా హై.. సౌండ్ బడా హై అన్నట్లుగా..గత ఐదేళ్లలో నాని అనే పేరు ఏపీలో ఓ మోత మోగింది. ఏ న్యూస్ చూసినా..ఎవరిని ఎవరు విమర్శించుకున్నా..నాని అనే పేరు లేకుండా ఏపీ రాజకీయం నడవ లేదు. ఇప్పుడు కూడా ఆ ముగ్గురు నేతలు నిత్యం వార్తల్లో ఉంటూనే వస్తున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో అయితే ఏపీ పాలిటిక్స్‌లో నానీ అన్న పేరు ఎంత బాగా నలిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ రాజకీయాల్లో నానీలు చాలా మంది ఉన్నా..వారి అసలు పేర్లు వేరే అయినా..ఈజీగా పలికేలా ఉండే నాని అనే పేరు అయితే లైమ్‌లైట్‌లో ఉంటూ వచ్చింది.ముగ్గురు నానీలపై ఏపీ పాలిటిక్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ఐదేళ్లలో ఓ వెలుగు వెలిగారు ఆ ముగ్గురు నానీలు. వైసీపీ ప్రభుత్వంలో కొడాలి నాని, పేర్నినాని, ఆళ్లనాని ముగ్గురు మంత్రులుగా పనిచేశారు. వీరిలో ఇద్దరు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నేతలు అయితే మరొకరు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్లనాని అలియాస్ కాళీ కృష్ణ శ్రీనివాస్. ఇక గుడివాడలో కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా నిలిచారు.సెటైర్లు పంచులు వేస్తూ పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్నినాని కూడా వైసీపీలో కీలకంగా ఉంటూ సమాచార మంత్రిగా వ్యవహరించారు. ఇలా ఈ ముగ్గురు నానీలు 2019 నుంచి 2022 దాకా మూడేళ్ల పాటు అమాత్యులుగా పనిచేశారు. ఆ తర్వాత ముగ్గురు పదవులు ఊడాయి. దాంతో మాజీమంత్రులు అయ్యారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో..నానీల పరిస్థితి గమ్మత్తుగా మారింది. ఒక్కొక్కరిది ఒక్కో కష్టం అన్నట్లుగా మారిపోయింది సీన్.ఎన్నికల రిజల్ట్ వచ్చిన వెంటనే కొడాలి నాని ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఆయనను వరుస కేసులు చుట్టు ముడుతున్నాయి. కొడాలి నాని అనుచరులు అరెస్ట్ అవుతూ వస్తున్నారు. నాని మీద కూడా అక్కడక్కడ కేసులు నమోదయ్యాయి. విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఆయనను అరెస్ట్ చేయాలంటూ టీడీపీ క్యాడర్ నుంచి కూటమి ప్రభుత్వం మీద తీవ్ర ప్రెజర్ కొనసాగుతోంది. న్యూఇయర్‌లో కొడాలి నానికి కష్టాలు తప్పవన్న టాక్ వినిపిస్తోంది.
ఇక మరో నేత ఆళ్లనాని వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ గడప దగ్గర ఉన్నారు. ఆ పార్టీలో చేరేందుకు ఆయన వెయిట్ చేస్తున్నారు. అయితే ఆళ్లనాని సైకిల్ సవారీకి ఏలూరు టీడీపీ లీడర్లు బ్రేకులు వేస్తుండటంతో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు.పేర్నినాని మీడియా ముందుకు వచ్చి వైసీపీకి ఒక బలమైన వాయిస్‌గా ఉంటున్నా ఈ మధ్యే రేషన్ బియ్యం వ్యవహారంలో ఆయన చిక్కుల్లో పడ్డారు. పేర్నినానితో పాటు ఆయన సతీమణి మీద కేసు నమోదు అయింది. పేర్నినాని భార్య పోలీస్ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఇంకా నోటీసులు, అరెస్ట్‌లు అంటూ హంగామా కంటిన్యూ అవుతోంది. ఇలా ముగ్గురు నానీలకు ఇప్పుడు రాజకీయం అంతా రివర్స్ లో నడుస్తోంది.అలా ముగ్గురు నానిల చుట్టూ వెలుగులన్నీ పోయి చిమ్మ చీకట్లు కమ్ముకున్నట్లు అయింది. కొడాలి నాని అయితే గుడివాడ ముఖం కూడా చూడటం లేదట. అంతేకాదు కొడాలి నాని పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పి తన సోదరుడి కుమారుడ్ని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. పేర్నినాని కూడా బాగా డీలా పడిపోతున్నారు. తన కుటుంబం మీద ఆరోపణలు రావడం..భార్య పోలీస్ విచారణను ఎదుర్కోవడంతో కలత చెందారట. ఆయన ఇప్పటికే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండి గత ఎన్నికల్లో తన తనయుడు పేర్ని కిట్టును బరిలోకి దింపారు. ఇక ఆళ్లనాని కూడా టీడీపీలో చేరికకు గ్రీన్‌సిగ్నల్ రాకపోతే పొలిటికల్ చౌరస్తాలో నిలబడ్డట్లు అవుతుందని ఆళ్లనాని డైలమాలో ఉన్నారట.ఇక వీరితో పాటుగా మరో నాని..కేశినేని నాని. రాజకీయంగా ఆగమైన నాయకుల్లో ఆయన ఒకరు. విజయవాడ ఎంపీగా వరుసగా రెండు సార్లు టీడీపీ నుంచి గెలిచిన ఆయన 2024లో మాత్రం వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించేశారు. అలా ఐదేళ్ల పాటు లైమ్‌లైట్‌లో ఉంటూ వచ్చిన నానీల రాజకీయం ఇప్పుడు తలకిందులైంది. ఇలా అయిందేంటి నానీ అంటూ టీడీపీ క్యాడర్ సెటైర్లు వేసే పరిస్థితి వచ్చేసింది.