Kiledi Maya Lady | కిలేడీ… మాయ లేడీ | Eeroju news

Kiledi Maya Lady

కిలేడీ… మాయ లేడీ

రాజమండ్రి, ఆగస్టు 21 (న్యూస్ పల్స్)

Kiledi Maya Lady

sultana harass boys.. one boy suicide attempt..లేడీ కాదు కిలేడీ.. పదుల  సంఖ్యలో యువకులు... వేధింపులు తాళలేక, యువకుడు - Telugu Oneindiaఆమె… వయసు మళ్లిన వారి ఇళ్లలో మాత్రమే పనిచేస్తుంది. వయోవృద్ధులకు చేదోడువాడోదుగా ఉంటుంది. అంతా తానై వృద్ధుల బాగోగులు చూసుకుంటుంది. తక్కువ కాలంలోనే ఇంట్లో మనిషిగా కలిసిపోతుంది. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇంట్లో వాళ్లకు తనపై పూర్తిగా నమ్మకం కలిగాక తన అసలు రంగు బయటపెడుతుంది. మంచి టైం చూసుకుని ఇంట్లో వాళ్లకు ఆహారంలో మత్తు మందు కలిపి ఇస్తుంది. వాళ్లు మత్తులోకి జారుకున్నాక.. క్షణాల్లోనే ఇల్లు గుళ్ల చేస్తుంది. వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్న ఈ కిలేడిపై ఇప్పటి వరకూ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో 18 కేసులు నమోదు అయ్యారు. 10 కేసుల్లో నేరం రుజువయ్యి జైలు జీవితం కూడా గడిపింది. అయినా ఆమె తన తీరు మార్చుకోలేదు. జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ సీన్ రిపీట్. తాజాగా రాజమహేంద్రవరం పోలీసులకు చిక్కింది.

ఈ కేసుపై డీఎస్పీ భవ్యకిషోర్‌ రాజమహేంద్రవరంలో సోమవారం మీడియాకు వివరాలు తెలిపారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంగర గ్రామానికి చెందిన నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్‌ బుజ్జికి పెళ్లి కాగా భర్త మృతి చెందాడు. ప్రస్తుతం ఆమె రాజమండ్రిలోని బొమ్మూరులో ఒంటరిగా నివసిస్తుంది. ఇంటి పని, వంట పని బాగా చేస్తానని వృద్ధులకు మాయమాటలు చెప్పి వారి ఇళ్లలో పనిమనిషిగా చేరుతుంది. కొన్నాళ్లు నమ్మకంగా పనిచేసి… అదును చూసుకుని ఇంటి యజమానులు తినే అన్నం, తాగే పానీయాల్లో మత్తు మందు కలిపి వాళ్లు నిద్రలోకి జారుకున్నాక, వారి ఒంటి మీద నగలతో పాటు ఇంట్లో బంగారం, డబ్బుతో దోచేస్తుంది. అక్కడి నుంచి చాకచక్యంగా పరారవుతుంది. ఇలా చోరీ చేసిన బంగారు నగలను బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తనఖా పెడుతుంది.

తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో బుజ్జిపై కేసులు ఉన్నాయి. ఈ తరహా చోరీలపై నిఘా పెట్టిన పోలీసులు ఈ నెల 18న కిలేడీ బుజ్జిని అరెస్టు చేశారు. పలు దొంగతనం కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన బుజ్జి 2021లో బెయిల్ పై విడుదలైంది. జైలుకెళ్లి వచ్చినా తీరు మార్చుకోకుండా అదే తరహా చోరీలకు పాల్పడింది. తాజాగా ఆమెను అరెస్టు చేసిన రాజమహేంద్రవరం పోలీసులు…ఆరు కేసులకు సంబంధించిన 273.8 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ భవ్య కిషోర్‌ అభినందించారు.

చెడ్డీ గ్యాంగ్ ఈసారి ఏపీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇంతకు ముందు హైదరాబాద్ లో చోరీలు చేసిన చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు ఏపీలో సీసీ కెమెరాలకు చిక్కింది. తిరుపతి జిల్లా తిరుచానూరు పరిధిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. హైవే పక్కనే ఉన్న కొత్తపాళెం లేఅవుట్‌లోని ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ చోరీ చేసింది. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు మొత్తం దోచుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు…దర్యాప్తు ముమ్మరం చేశారు. దొంగలు బనియన్లు, డ్రాయర్లు ధరించి మారణాయుధాలతో ఇంటిలోకి రావడంతో… చెడ్డీ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Kiledi Maya Lady

 

 

Modi on a 4-day foreign visit | 4 రోజుల విదేశీ పర్యటనకు మోడీ | Eeroju news

 

Related posts

Leave a Comment