Khammam:నిరసనల మధ్యే రైల్వే లైన్ పనులు

నిరసనల మధ్యే రైల్వే లైన్ పనులు

మూడో రైల్వే లైన్‌కు సంబంధించి ఖమ్మం రైల్వేస్టేషన్‌తో పాటు ఖమ్మం రైల్వేమార్గంలోని పలు ప్రాంతాల్లో పనులు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పనుల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ మార్గంలో నడిచే దాదాపు 50కి పైగా రైళ్లను సైతం ఈనెల 9 వరకు తాత్కాలికంగా నిలిపేసి, పనులు చేపడుతున్నారు. ఖమ్మంలె చేపట్టిన మూడో రైల్వే లైన్ పనుల్లో అంతరాయం లేకుండా రైల్వే ఉన్నతాధికారులతో పాటు ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్, జిల్లా కలెక్టర్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

నిరసనల మధ్యే రైల్వే లైన్ పనులు

ఖమ్మం. జనవరి 7
మూడో రైల్వే లైన్‌కు సంబంధించి ఖమ్మం రైల్వేస్టేషన్‌తో పాటు ఖమ్మం రైల్వేమార్గంలోని పలు ప్రాంతాల్లో పనులు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పనుల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ మార్గంలో నడిచే దాదాపు 50కి పైగా రైళ్లను సైతం ఈనెల 9 వరకు తాత్కాలికంగా నిలిపేసి, పనులు చేపడుతున్నారు. ఖమ్మంలె చేపట్టిన మూడో రైల్వే లైన్ పనుల్లో అంతరాయం లేకుండా రైల్వే ఉన్నతాధికారులతో పాటు ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్, జిల్లా కలెక్టర్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. రైల్వే లైన్ విస్తరణ కోసం కావాల్సిన భూమిని సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి మురుగు కాల్వల నిర్మాణం కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న మురుగు కాల్వను కూడా మరింత వెడల్పు చేస్తున్నారు. నగరంలోని స్టేషన్ నుంచి మామిళ్లగూడెం, సారథినగర్, బైపాస్‌రోడ్డు ఏరియా, శ్రీనివాసనగర్ సమీప ప్రాంతాల్లో పనులు నిర్వహిస్తుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.వాహనాలను వేరే మార్గంలో మళ్లిం చినప్పటికీ ఇబ్బంది తప్పడం లేదు. నగరంలోని 36, 37 డివిజన్ల పరిధిలో పనులు నిర్వహిస్తున్నారు. ట్రాక్ విస్తరణ పనులతో పాటు ఇంటర్ లాకింగ్, విద్యుద్దీకరణ, మురుగు కాల్వల నిర్మాణం తదితర పనులు నిర్వహిస్తున్నారు. ట్రాక్ విస్తరణ కోసం భూసేకరణ కార్యక్రమం కూడా జరుగుతోంది. మధిర, ఎర్రుపాలెం, మోటమర్రి తదితర స్టేషన్లలోనూ పను లు జరుగుతున్నాయి. అయితే ఎర్రుపాలెం ప్రాంతంలో పనులు ఇప్పటికే పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం, మధిరలో ఇంకా భూసేకరణ పూర్తి కాలేదు.భూసేకరణ పూర్తయితే మరింత వేగంగా పనులు జరగడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఖమ్మం, మధిర పట్టణంలో ఇళ్ల యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో కొంత వివాదం నెలకొంది. పలువురు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఇండ్లు కోల్పోయిన వారికి స్థలాలు, పరిహారం విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూడో లైన్ కోసం దాదాపు 126 ఎకరాల వరకు అవసరం ఉందని అధికారులు తేల్చారు.విలువైన భూము లు కోల్పోతుండడంతో రైతులు పరిహారం విషయంలో ససేమిరా అంటున్నారు. చింతకాని, నాగులవంచ,అనంతసాగర్ తదితర ప్రాంతాల్లో విలువైన భూములను రైతులు కోల్పోతున్నారు. ఖమ్మం నగరంలో నర్తకి థియేటర్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కింది ప్రాంతం, సారథినగర్, బుర్హాన్‌పురం తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున ఇళ్లు తొలగించాల్సి ఉంది. మెరుగైన పరిహారం చెల్లించి, భూసేకరణ జరపాలని బాధితులు ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read:Nizamabad:ఆత్మీయ భరోసా సర్వే షురూ

Related posts

Leave a Comment