Ketan Desai | ఏ ప్రభుత్వం ఉన్నా…. కేతిన్ దేశాయ్ కు మాత్రం | Eeroju news

ఏ ప్రభుత్వం ఉన్నా.... కేతిన్ దేశాయ్ కు మాత్రం

ఏ ప్రభుత్వం ఉన్నా…. కేతిన్ దేశాయ్ కు మాత్రం

తిరుమల, నవంబర్ 1, (న్యూస్ పల్స్)

Ketan Desai

పాలకమండలిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి కూడా అవకాశం లభించింది. తెలుగుదేశం పార్టీ నుంచి నర్సిరెడ్డికి, జనసేన పార్టీ నుంచి మహేందర్ రెడ్డికి చోటు దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత కొద్దిరోజులుగా వివాదాలు వినిపిస్తున్నా. లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారని విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఈ వివాదంలో తెలుగుదేశం పార్టీ, వైసిపి పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత నాడు వైసిపి ఏర్పాటు చేసిన పాలకమండలి రద్దయింది. దీంతో కూటమి ప్రభుత్వం కొత్తగా పాలకమండలిని ఏర్పాటు చేసింది.

చైర్మన్ గా బీ ఆర్ నాయుడు పేరును ప్రకటించింది. బి.ఆర్ నాయుడు పేరు ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఇటీవల ఆయన కుమారుడి పై మాదకద్రవ్యాల ఆరోపణలు వచ్చాయి. దీనిని సాక్షి మీడియా పదేపదే రాసింది. మాదగ ద్రవ్యాలు స్వీకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తండ్రికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి ఎలా ఇస్తారంటూ సాక్షి మీడియా కథనాల మీద కథనాలు రాసింది. అయితే అవన్నీ పూర్తి నిరాధారమని తేలడంతో బీఆర్ నాయుడు కు లైన్ క్లియర్ అయింది. మొత్తంగా 24 మందితో కూడిన సభ్యులతో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారు. బుధవారం సాయంత్రం నూతన పాలక మండలిని ప్రకటించారు.

బీఆర్ నాయుడి పేరును చైర్మన్ గా ప్రకటించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోయినప్పటికీ.. పాలకమండలిలో ఒక వ్యక్తి పేరు మాత్రం మీడియా వర్గాలను ప్ షాక్ కు గురిచేసింది. ఎందుకంటే గత వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. నియమించిన పాలకమండలిలో అతడు ఉన్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసిన పాలక మండలి లోనూ అతడు సభ్యుడుగా ఉన్నాడు.. ఆ సభ్యుడి పేరు ఆదిత్ దేశాయ్.. అతడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యుడు కేతన్ దేశాయ్ కుమారుడు. కేతన్ దేశాయ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు చైర్మన్ గా పనిచేశాడు. అనేక అవినీతి కేసులలో అరెస్ట్ అయ్యాడు. అనేక అక్రమాలకు పాల్పడి రెండుసార్లు పదవి కూడా పోగొట్టుకున్నాడు.

చాలా కాలం పట్టు జైల్లో ఉన్నాడు. అయితే అతడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యుడు కావడం ఏంటని చాలామంది హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ సాగించి.. కేతన్ దేశాయ్ ని పాలకమండలిలో సభ్యుడిగా నియమించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ప్రభుత్వ వ్యవహారశైలి పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది.కేతన్ దేశాయ్ ది అవినీతి చరిత్ర. అక్రమాల పుట్ట. అతడు ఎన్నో అవకతవకలకు పాల్పడ్డాడు. కోట్లను వెనకేసుకున్నాడు. అయితే అతని కుమారుడికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యుడి అవకాశం ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కేతన్ దేశాయ్ కుమారుడు ఆదిత్ దేశాయ్ కూడా హెల్త్ కేర్ లోనే కొనసాగుతున్నాడు.. అయితే అటువంటి వ్యక్తికి టిటిడి బోర్డులో సభ్యుడిగా అవకాశం ఇవ్వడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

నాడు వైసీపీ ప్రభుత్వంలో.. నేడు కూటమి ప్రభుత్వంలో బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కించుకున్నారంటే అదిత్ దేశాయ్ ఎంత శక్తివంతుడో అర్థం చేసుకోవచ్చు. అతడు జూనియర్ వైద్యుల సంఘాలను నిర్వహిస్తున్నాడు. బిజెపి పెద్దలకు అత్యంత దగ్గరగా ఉంటాడు. అందుకే పార్టీలతో సంబంధం లేకుండా అతడు తిరుమల తిరుపతి దేవస్థానం లో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. టీటీడీ ప్రకటించిన పాలక మండల లో బిజెపి కోటా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరికీ అవకాశం లభించలేదు . ఇక కర్ణాటక, తమిళనాడు ఇతర రాష్ట్రాలకు చెందినవారికి అవకాశం కల్పించారు. అయితే వీరంతా భారతీయ జనతా పార్టీకి చెందిన వారిని తెలుస్తోంది. స్థూలంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి లో సగం మంది బిజెపి సిఫారసు చేసిన వ్యక్తులే. ఇక పాలకమండలిలో రామోజీరావు మనవరాలి అత్తగారు సుచిత్ర ఎల్లా కు సభ్యురాలిగా అవకాశం లభించింది.

 

Deputy CM orders Probe into Lands of Saraswati Power | సరస్వతి భూముల్లో సర్వే | Eeroju news

Related posts

Leave a Comment