KCR approached the Supreme Court | సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. ఎందుకంటే.? | Eeroju news

KCR approached the Supreme Court

సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. ఎందుకంటే.?

హైదరాబాద్

KCR approached the Supreme Court

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని గతంలో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌నుతెలంగాణ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రేపు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు కేసు విచారణ జరగనున్నది.

కాగా తెలంగాణలో జరిగిన విద్యుత్తు ఒప్పందాలపై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్‌ మాజీ సీఎం కేసీఆర్‌కు రెండోసార్లు నోటీసులు పంపించింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్‌ పాత్రపై కమిషన్‌ వివరణ కోరింది. తనను విచారణకు పిలవకూడదంటూ కేసీఆర్ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. అయితే గులాబీ బాస్‌కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. కేసీఆర్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

 

KCR approached the Supreme Court

 

Greater Mayor Gadwala Vijayalakshmi’s shock to the rose | గ్రేటర్ లో గులాబీకి షాక్… | Eeroju news

 

 

Related posts

Leave a Comment