KCR | హాట్ టాపిక్ గా కేసీఆర్ మౌనం | Eeroju news

హాట్ టాపిక్ గా కేసీఆర్ మౌనం

హాట్ టాపిక్ గా కేసీఆర్ మౌనం

హైదరాబాద్, అక్టోబరు 28, (న్యూస్ పల్స్)

KCR

రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ మౌనం ఓ హాట్ టాపిక్. ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ ఎక్కువగా మీడియాలో కనిపించేందుకు ఇష్టపడరు. సందర్భం వచ్చినప్పుడు..తాను మాట్లాడక తప్పదనుకున్నప్పుడు మాత్రమే ఆయన మీడియా ముందుకు వస్తారు.పార్టీ క్యాడర్‌కు బలమైన సందేశం ఇవ్వాలనుకుంటే..జోష్ నింపాలనుకుంటే సమయం, సందర్భం చూసి మాట్లాడుతారు. సరైన సమయం చూసి ఎంటర్ అవుతారు. ఇలా దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన మౌనంగా ఉన్నా వార్తే… నోరు తెరిచినా వార్తే అనేలా సాగాయి తెలంగాణా పాలిటిక్స్. పదేళ్ల అధికారం తర్వాత ప్రతిపక్షంగా బిఆర్ ఎస్ మారిన తర్వాత నుండి కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొంత హడావుడి చేసినా… ఆ తర్వాత మళ్లీ మౌనం దాల్చారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి.

రైతు రుణమాఫీ పూర్తిస్ధాయిలో కాలేదని బీఆర్ఎస్సే ఆరోపిస్తోంది. పైగా నాలుగు వేల పెన్షన్ అమలులోకి రాలేదు. హైడ్రా, మూసీ గొడవ అయితే రెగ్యులర్ అయిపోయింది. మరి ఇన్ని ఇష్యూస్ ఉన్నా కేసీఆర్ రియాక్ట్ కాకపోవడానికి కారణం ఏంటన్న ది హాట్ టాపిక్గా మారింది. అధికార పార్టీకి టైమ్ఇస్తున్నారా..? సమయం కోసం ఎదురు చూస్తున్నారా..? కేసీఆర్మౌనం ఎందుకంటూ అధికార కాంగ్రెస్లో..ఇటు బీఆర్ఎస్ క్యాడర్, లీడర్లలో చర్చ జరుగుతోంది.పార్లమెంట్ ఎన్నికల తర్వాత..కేటీఆర్, హరీశ్రావే పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ప్రతీ రోజు పబ్లిక్లో ఉంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం లేదు. దీంతో కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫాంహౌస్ లోనే పడుకుంటున్నారని అధికార పార్టీ విమర్శలు చేస్తున్నా మౌనమే ఆయన సమాధానమవుతుంది.

లేటెస్ట్ గా మంత్రి పొంగులేని శ్రీనివాస్ రెడ్డి బ్లాస్టింగ్ న్యూస్ ఉంటుందని.. దీపావళి లోపు ఏదో సంచలనం జరగబోతుందన్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు.దీనిపై కేటీఆర్ స్పందించారే తప్ప..కేసీఆర్ మౌనం వీడటం లేదు. ఎమ్మెల్యేల వలస నుంచి ఇప్పుడు పొంగులేటి వ్యాఖ్యల వరకు అధికార పార్టీ బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా..కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదన్న చర్చ గులాబీ పార్టీలోనూ జరుగుతోంది. అయితే వచ్చే ఎన్నికల వరకు బీఆర్ఎస్ను నడిపించేది కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరేనా అన్న డిస్కషన్ వస్తోంది. కేటీఆర్, హరీశ్రావుకే గులాబీ దళపతి పార్టీ బాధ్యతలు అప్పగించారని..వాళ్లే అంతా చూసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఓ చర్చ జరుగుతోందిమరోవైపు కేసీఆర్ మౌనం వెనక ఉన్న కారణాలపై పొలిటికల్ ఎనలిస్టులు ఎన్నో రకాలు విశ్లేషిస్తున్నారు.

కొందరు బీఆర్ఎస్ నేతలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే రాష్ట్రంలో ఎన్నో ఇష్యూస్ ఉన్నా విపక్ష నేతగా ఉన్న కేసీఆర్ సైలెంట్గానే ఉంటున్నారని చెప్పుకొస్తున్నారు. గడువు ఇవ్వకుండా ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారట కేసీఆర్.మీడియా ముందు కనిపించకపోయినా ఫాంహౌస్ నుంచే పార్టీ నేతల ద్వారానే రాజకీయాలను నడిపిస్తున్నారు కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి సహా నేతలంతా కేసీఆర్ టార్గెట్గా రెచ్చగొట్టేలా విమర్శలు చేస్తున్నా కాంగ్రెస్ నేతల ట్రాప్లో పడటం లేదు గులాబీ దళపతి. అయితే మరో మూడు నెలల్లో సార్ ఫీల్డ్లోకి దిగుతారని చర్చించుకుంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై డిసెంబర్ 7నాటికి ఏడాది పూర్తికానుంది.

ఆ తర్వాతే కేసీఆర్ ప్రజా ఉద్యమాలకు మొదలుపెడుతారని అంటున్నారు.ఓ వైపు ప్రభుత్వ తీరుపై పోరాటం చేస్తూనే.. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టే వ్యూహరచన చేస్తున్నారట కేసీఆర్. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27వరకు సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీల నియామకాన్ని పూర్తి చేసి..ఇక ప్రభుత్వ వైఫల్యాలపై కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయినా అమలు చేయని హామీలపై భారీ సభ నిర్వహించాలని కూడా గులాబీ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. సెంటిమెంట్లకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే కేసీఆర్ పీడ దినాలు అయిపోయాక సంక్రాంతి తర్వాత..ప్రజాక్షేత్రంలోకి దిగాలని నిర్ణయించుకున్నారట.

హాట్ టాపిక్ గా కేసీఆర్ మౌనం

 

KCR’s new plan | కేసీఆర్ నయా ప్లాన్ | Eeroju news

Related posts

Leave a Comment