KCR | కేసీఆర్ గురించి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం | Eeroju news

కేసీఆర్ గురించి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం

కేసీఆర్ గురించి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం

హైదరాబాద్

KCR

సంపతమ్మ మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం-Namasthe Telanganaకేసీఆర్ గురించి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ నేత,కె .వాసుదేవ రెడ్డి బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిన్న వరంగల్ లో సీఎం కాళోజి కళా క్షేత్రాన్ని ప్రారంభించారు. 2004 నుంచి 2014 వరకు అధికారం లో కాంగ్రెస్ ఉన్నపుడు కాళోజి ట్రస్టు వాళ్ళు 300 గజాల స్థలం అడిగినా ఇవ్వలేదు. .హంటర్ రోడ్డు లో కాళోజి ట్రస్టు వాళ్ళు సొంతంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2014 లో కేసీఆర్ అధికారం లోకి రాగానే కాళోజి ట్రస్టు కు నాలుగున్నర ఎకరాలు కేటాయించారు. .కాంట్రాక్టర్ అలసత్వం వల్లే కాళోజి కళాక్షేత్రం నిర్మాణం అప్పట్లో ఆలస్యం అయ్యిందని అన్నారు.

కేసీఆర్ అప్పట్లోనే 35 కోట్ల రూపాయలు కేటాయించారు. కళాక్షేత్రం మొత్తం ప్లానింగ్ కేసీఆర్ ప్రభుత్వ హయం లోనే జరిగింది. నిర్మాణం కేసీఆర్ హయం లోనే పూర్తి అయ్యింది ..కేవలం రంగులు వేసి తాను కాళోజి క్షేత్రాన్ని ప్రారంభించానని రేవంత్ చెప్పుకుంటున్నారు. తెలంగాణ ద్రోహి రేవంత్ కళాక్షేత్రం ప్రారంభించినందుకు కాళోజి ఆత్మ క్షోభించి ఉంటుంది. కాళోజి ట్రస్టు సభ్యులు వినతి పత్రం ఇద్దామనుకున్నా రేవంత్ రెడ్డి టైం ఇవ్వలేదు. కనీసం కవులు కళాకారులకు సన్మానం చేయలేదు. ఫంక్షన్ హల్ ప్రారంభించినట్టు కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. వరంగల్ లో మహిళల సమావేశం పెట్టి కేసీఆర్ ను తిట్టేందుకే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారు. విద్యార్థులు ,మహిళలు రేవంత్ భాష ను చూసి అసహ్యించుకుంటున్నారు.

రేవంత్ ఈ ఏడాది లో చేసిందేమి లేదు కనుక తిట్లు అందుకుంటున్నారు. రేవంత్ రాజకీయ ప్రస్థానం టీ ఆర్ ఎస్ లో మొదలైంది. అందుకు రేవంత్ విడుదల చేసిన ప్రకటనలే సాక్ష్యం. కల్వకుర్తి జిల్లా టీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్ ను పొగడుతూ ప్రకటనలు విడుదల చేశారు. .తన అవసరాన్ని బట్టి నేతలను పొగడటం తిట్టడం రేవంత్ కు అలవాటు గా మారింది. సోనియా ను బలిదేవత అన్నది రేవంత్ కాదా ? కేసీఆర్ పోరాడితేనే తెలంగాణ వచ్చింది అన్నది రేవంత్ కాదా ? కేసీఆర్ మొక్క కాదు చిదిమేయడానికి ,ఆయన మహా వృక్షం. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. .రేవంత్ తెలంగాణ కు కాలకేయుడిలా మారారు. .బాహుబలి కేసీఆర్ చేతిలో రేవంత్ రాజకీయ జీవితం పరిసమాప్తం కావడం ఖాయమని అన్నారు.

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ వరంగల్ లో జరిగింది విజయోత్సవ సభ కాదు ..సీఎం రేవంత్ బూతుల సభ. .రాజకీయాల్లో నవ తరానికి రేవంత్ బూతుల ద్వారానే పైకి రావొచ్చని సందేశం ఇస్తున్నారా ? ఏం సాధించారని రేవంత్ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారని రేవంత్ సంబరాలు జరుపుతున్నారు. మహిళలకు రుణాలు రావాలంటే సభ కు రావాల్సిందేనని ఒత్తిడి చేసి సభకి రప్పించారు. .ప్రజలు ఎపుడో మరచి పోయిన బూతులను రేవంత్ మళ్ళీ నేర్పుతున్నారు. రాహుల్ గాంధీ ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలా ? .రాహుల్ ఇంకా 30 సవవత్సరాలైనా పీఎం కాలేడు ..ఆయన్ను చూసి కేసీఆర్ ఏం నేర్చుకోవాలని అన్నారు.

రేవంత్ సభకు కొందరు మంత్రులు రాలేదు ,జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే రాలేదు. మేము మొదలుపెట్టిన పనులకు అరకొర నిధులిచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. సచివాలయం గేటు కూడా మారుస్తున్నారు ..కొంపతీసి రేవంతే కట్టారని శిలాఫలకం వేస్తారా ? సోనియా తెలంగాణ ఇచ్చింది అంటున్నారు. .స్వాతంత్రం గురించి కొట్లాడిన గాంధీ కి దండాలు వేస్తామా ..బ్రిటిష్ వాళ్ళకా ? తెలంగాణ కోసం కేసీఆర్ 14 యేండ్లు అహో రాత్రులు కష్టపడ్డారు .ప్రత్యేక రాష్ట్రం సాధించారు. .వరంగల్ కు వచ్చి ఏమిచ్చావ్ సీఎం ? వరంగల్ లో కేసీఆర్ హయం లో ఎన్నో పనులు జరిగాయి ..వాటి గురించి రేవంత్ ఎందుకు మాట్లాడరని అన్నారు.

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి గురించి ఎందుకు ప్రస్తావించలేదు. తిట్లు దేవుళ్ళ మీద ఒట్లు ఆపి పాలన మీద ద్రుష్టి సారించు రేవంత్. రేవంత్ ఎదుర్కోవడానికి మా లాంటి వాళ్ళము చాలు ..కేసీఆర్ ఎందుకు ? కే టీ ఆర్ ,హరీష్ రావు లు ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యల గురించి చెబితే తప్పా రేవంత్ తన సీటు పోతుందని భయపడి మాట్లాడుతున్నట్టు ఉంది. రేవంత్ ఐదేళ్లు సీఎం గా ఉండి బాగా పాలించాలని కోరుకుంటున్నాం. .సీఎం బూతులు బంద్ చేయాలి. .కేసీఆర్ గురించి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని అన్నారు.

కేసీఆర్ గురించి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం

 

KCR survey results | కేసీఆర్ సర్వే రిజల్ట్స్ ఎక్కడ… | Eeroju news

Related posts

Leave a Comment