KBR Park Traffic : కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ చెక్

kbr park

KBR Park Traffic : కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ చెక్

హైదరాబాద్, డిసెంబర్ 16, (న్యూస్ పల్స్)
 కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, కాంగ్రెస్ దిగ్గజ నేత జానారెడ్డి ఇళ్లకు ప్రభుత్వం మార్కింగ్ చేయడం చర్చనీయాంశమైంది.భాగ్యనగరంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రోడ్డు ఒకటి. ప్రముఖుల నివాసులు, నగరంలోని కీలక ప్రాంతాలన్నీ ఈ పార్కు చుట్టూనే ఉండడంతో.. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే.. ఈ రోడ్డును విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఈ మేరకు.. ప్రాథమిక కసరత్తులు ప్రారంభించిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న రహదారి నుంచి విస్తరణ చేపట్టనున్న వరకు మార్కింగ్ చేపట్టారు. కాగా.. ఈ మార్కింగ్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు 86 ఆస్తులకు ప్రభుత్వ మార్కింగ్ చేయాల్సి వచ్చింది. అంటే.. ఆ మార్కింగ్ వరకు ఉన్న నిర్మాణాల్ని తొలగించాల్సి ఉంటుంది.ఈ మార్కింగ్ లో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం ఉండడంతో చర్చనీయాంశమవుతోంది. రోడ్ నంబర్ 45లోని బాలకృష్ణ నివాసం లోపల దాదాపు 6 అడుగుల మేర మార్కింగ్ చేశారు. అలాగే.. కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికీ ఈ రోడ్డు వెడల్పు ఎఫెక్ట్ తగిలింది. ఆయన ఇంటి ముందు ఉన్న ప్రహరీ గోడ సైతం బల్దియా అధికారులు చేసిన మార్కింగ్ లోపల ఉంది. దాంతో.. రేవంత్ సర్కార్ పనితీరుకు అంతా అభినందిస్తున్నారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా అందరికీ ఒకే తరహా విధానాన్ని అమలు చేయడాన్ని స్వాగిస్తున్నారు.అయితే.. మార్కింగ్ చేసిన వరకు రోడ్డును విస్తరిస్తారా? లేక.. కొలతలు వేయడం వెనుక ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. బల్దియా సిబ్బంది మార్కింగ్ చేసిన స్థలాల యజమానులకు నోటీసులు ఇచ్చిన అనంతరం సంబంధిత పనులు మొదలు పెడతారనే చర్చ నడుస్తోంది. ఒకవేళ మార్కింగ్ చేసినంత వరకు ఆర్‌అండ్‌బీ భూమి అయితే యజమానులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఉండదు. లేకపోతే.. వారి నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అయినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిరభ్యంతరంగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే తమ ఇళ్లకు మార్కింగ్ వేయడంపై జానారెడ్డి, బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.కేబీఆర్ పార్క్ చుట్టూ నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందుల్ని త్వరితగతిన తగ్గించేందుకు రేవంత్ సర్కార్ కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లిహిల్స్ చెక్ పోస్టు దగ్గర, కేబీఆర్ పార్క్ వాకింగ్ ట్రాక్ కు అభిముఖంగా హీరో బాలకృష్ణ ఇల్లు ఉంటుంది. అయితే ఈ స్థలంలో కొంత రోడ్డు వైడెనింగ్ లో పోతుంది. చట్ట ప్రకారం పరిహారం తీసుకుని ఆ స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ ప్రభుత్వానికి అంగీకారపత్రం ఇచ్చారని తెలుస్తోంది. ఇందుకు ప్రతిగా ఆ స్థలంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని తెలుస్తోంది.బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ పై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి టాలివుడ్ ను టార్గెట్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదని తెలుస్తోంది. బాలకృష్ణ ఇటీవలి జూబ్లిహిల్స్ లోనే రెండు ఇళ్లు కొనుగోలు చేశారని సమాచారం. ఆయన ప్రస్తుతం ఉన్న ఇంటి స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి, మరో ఇంటికి మారాలని బాలకృష్ణ భావిస్తున్నారని సమాచారం. అయితే ఇందులో ఎలాంటి వివాదం లేదని తెలుస్తోంది.ఇక్కడి కీలక జంక్షన్లల్లో యుద్ధప్రాతిపదికన బ్రిడ్జులు, వంతెనలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే.. అధికారులు కసరత్తులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా.. కీలక జంక్షన్లలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా స్టీల్ బ్రిడ్జీలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే డిజైన్లు సైతం సిద్ధం చేయగా.. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణాల కోసం ఇప్పటికే భూమి పరీక్షలు కూడా నిర్వహించారు. కాంక్రీట్ ఫ్లైఓవర్లు నిర్మిస్తే ఆలస్యమవుతుందని, ట్రాఫిక్ సమస్యలు మరింత అధికమవుతాయని భావిస్తున్న అధికారులు.. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణానికి మొగ్గుచూపుతున్నారు.

Read : CM Revanth Reddy : సంక్రాంతికి రేవంత్ పూర్తి సైన్యం

Related posts

Leave a Comment