Kavitha’s case postponed again | కవిత కేసు మళ్లీ వాయిదా | Eeroju news

Kavitha's case postponed again

కవిత కేసు మళ్లీ వాయిదా

హైదరాబాద్, ఆగస్టు 20

Kavitha’s case postponed again

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కోరిన ఈడీపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈడీ మరికొంత సమయం కోరడంతో న్యాయస్థానం విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. కవితను అకారణంగా ఐదు నెలలుగా జైల్లోనే ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడిన నేపథ్యంలో ఆ రోజున కవితకు తప్పకుండా బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, కవిత బెయిల్ పిటిషన్‌పై శుక్రవారంలోగా కౌంటర్ దాఖలు చేయలని ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈడీ, సీబీఐ కౌంటర్లపై రీజాయిండర్ వేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాదులు వెల్లడించారు.

Kavitha's case postponed again

 

MLC Kavitha’s case in the Supreme Court | సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు | Eeroju news

Related posts

Leave a Comment