గ్రామసభలు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాయని కాలనీ ల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదపడతాయని గ్రామ సర్పంచ్ పాల్ దినకర్ పేర్కొన్నారు.
గ్రామ సభలు గ్రామ అభివృద్ధి కి కృషి
కౌతళం
గ్రామసభలు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాయని కాలనీ ల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదపడతాయని గ్రామ సర్పంచ్ పాల్ దినకర్ పేర్కొన్నారు. గురువారం గ్రామ పంచాయతీ ఆధ్వరంలో సర్పంచ్ అధ్యక్షతన మరియు పంచాయతీ కార్యదర్శి బి.శివప్ప ప్రభుత్వ అధికారుల సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు “గ్రామ సభ” ఏర్పటు చేశారు.ఈ సభ లో గత సంవత్సరంలో జరిగిన పనుల మరియు ఎన్ ఆర్ ఈ జిఎస్ నిధుల కేటాయింపు గురించి మరియు రాబోయే రోజుల్లో జరగబోయే పనుల గురించి చర్చించడం జరిగింది. మరియు ఆరోగ్యశాఖ అధికారి వారి ద్వార ఆరోగ్యపరమైన సూచనలు వినివించడం,శానిటేషన్, ప్రభత్వపరంగా వస్తున్న పథకాలు అమలు విధానం గురించి చర్చించడం, నీటి సమస్య , వివిధ రకాల సచివాలయం నుంచి పథకాలు గురించి సచివాలయం సిబ్బంది ద్వారా వివరించడం మరియు ప్రజల ద్వారా అర్జీలను స్వీకరించి తదనుగుణంగా “గ్రామ సభ ” జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, వివిధ శాఖకు సంబంధించిన అదికారులు మరియు సచివాలయం సిబ్బంది,పంచాయతీ సిబ్బంది, ప్రజా ప్రతినిదులు, గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.
Read:Telangana:అభివృద్ధి చూసి ఓర్వలేక పోతున్నా బీఆర్ఎస్ నేతలు