Karimnagar | తలలు పట్టుకుంటున్న పత్తి రైతులు | Eeroju news

తలలు పట్టుకుంటున్న పత్తి రైతులు

తలలు పట్టుకుంటున్న పత్తి రైతులు

కరీంనగర్, అక్టోబరు 22, (న్యూస్ పల్స్)

Karimnagar

కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు గత వారం నుండి కొత్త పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే..ఇప్పుడు..ఇప్పుడే పత్తి మార్కెట్‌లోకి వస్తుంది. అయితే..పత్తికి కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.. క్వింటల్‌కు రూ.7521 ప్రభుత్వం ప్రకటించింది.అయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయడం లేదని రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత పేరుతో 7 వేల లోపే కొనుగోలు చేస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే పత్తి ధరలు తక్కువగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. కూలి రేట్లు పురుగుమందుల ధరలు ఎరువుల ధరలు అధికంగా పెరిగిపోయాయి. అంతేకాకుండా ప్రతికూల వాతావరణంతో దిగుబడి తగ్గింది. మద్దతు ధర రూ.8 వేల నుంచి 9వేల వరకు ఉండే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతుల కోరుతున్నారు. అయితే మార్కెట్లో ఇప్పటికీ సీసీఐ కొనుగోలు ప్రారంభించలేదు.

టెండర్లు పూర్తి అయ్యాయని 10 కాటన్ మిల్లులలో సీసీఐ కొనుగోలు వారం రోజుల్లో ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ వ్యాపారులు ఇష్టరాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ ధరతో పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు. మెజారిటీ మార్కెట్లలో ఇంకా పత్తి కొనుగోలు చేయలేదు. పత్తి ధర తగ్గడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తలలు పట్టుకుంటున్న పత్తి రైతులు

 

Farmers | రైతు భరోసా అందకుండానే ముగిసిన సీజన్ | Eeroju news

Related posts

Leave a Comment