వస్త్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సిరిసిల్ల నేతన్నకు రాష్ట్ర ప్రభుత్వం చేయుతనిచ్చింది. త్వరలో మహిళా గ్రూపులకు అందజేసే చీరల ఆర్డర్స్ సిరిసిల్ల నేతన్నకు సర్కార్ ఇచ్చింది. సాంచల చప్పుడుతో నేతన్నలు బిజీగా మారుతున్నారుసిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి నేతన్న బతుకు పై భరోసా కల్పించే చర్యలు ప్రభుత్వం చేపట్టింది.
సిరిసిల్ల నేతన్నలకు బంపర్ ఆఫర్
కరీంనగర్, జనవరి 23
వస్త్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సిరిసిల్ల నేతన్నకు రాష్ట్ర ప్రభుత్వం చేయుతనిచ్చింది. త్వరలో మహిళా గ్రూపులకు అందజేసే చీరల ఆర్డర్స్ సిరిసిల్ల నేతన్నకు సర్కార్ ఇచ్చింది. సాంచల చప్పుడుతో నేతన్నలు బిజీగా మారుతున్నారుసిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి నేతన్న బతుకు పై భరోసా కల్పించే చర్యలు ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫామ్ చీరల ఆర్డర్స్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందజేశారు.ఇందిరా క్రాంతి మహిళా శక్తి చీరల పథకంలో భాగంగా ఒకే రంగు చీరల ఆర్డర్స్ 4.24 కోట్ల మీటర్లు అందజేసింది. ఈ చీరలను ఈ ఏప్రిల్ 30 వ తేదీలోగా సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్లతో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేసిందని టెస్కో జీఎం అశోక్ రావు తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మార్కెట్ తో పోటీపడి స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారుప్రభుత్వ, ప్రైవేట్ ఆర్డర్స్ తయారు చేసేలా యంత్రాలు ఆధునీకరించాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన రూ. 500 కోట్ల బకాయిలు విడుదల చేసిందని తెలిపారు. ఆధునిక, నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసేలా సిద్ధం కావాలని పేర్కొన్నారు. ఇప్పటికే స్కూల్ యూనిఫాం మరమగ్గాల సంఘాలకు 65.67 లక్షల మీటర్లు ఆర్డర్స్ ఇచ్చామని వెల్లడించారుఆర్డర్స్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ సెక్రటరీకి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బాధ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డర్స్ కాఫీ అందుకునే కార్యక్రమంలో హ్యాండ్ లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ సాగర్, టెస్కో ఏడీ సందీప్ జోషి తదితరులు పాల్గొన్నారుబతుకమ్మ చీరలు రద్దుతో నేత కార్మికులు ఆర్థిక ఇబ్బందుల పాలయ్యారు. నేసిన గుడ్డకు గిరాకీ లేక, చేతినిండా పని దొరక్క నేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏడాది కాలంలో 30 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. సంక్రాంతి కి రెండు నెలల ముందు తమిళనాడు ప్రభుత్వం పొంగల్ చీరల ఆర్డర్ తో నేత కార్మికులకు కాస్త ఊరట లభించింది. ప్రస్తుతం మహిళా గ్రూపులకు పంపిణీ చేసే చీరల ఆర్డర్ రావడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆర్డర్లు అన్ని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పోచంపల్లి చీర.. రెండు డిజైన్లు
ప్రపంచవ్యాప్తంగా మగువలు మెచ్చే పట్టు చీరలకు ప్రసిద్ధి పోచంపల్లి. చేనేత కార్మికుల నైపుణ్యానికి ప్రతీక ఇక్కడి ఈ చీరలు. సృజనాత్మకత, నూతన డిజైన్లతో వస్త్రాల తయారీ ఇక్కడి చేనేత కార్మికుల అద్భుత కళారూపానికి నిదర్శనం. రెండు వైపులా వేర్వేరు డిజైన్లు, వేర్వేరు రంగులు కలిగిన ఇక్కత్‌పట్టు చీరను నేసి తెలంగాణ చేనేత ఘనతను ఓ కళాకారుడు ఔరా అనిపించాడు.ఇక్కడి చేనేత కార్మికుల అద్భుత కళారూపాలు ఖండాంతర ఖ్యాతిని సాధించాయి. ఈ ప్రాంతంలోని నేతన్నలు ఎన్నో చేనేత పురస్కారాలను అందుకున్నారు. తాజాగా ఓ యువ చేనేత కళాకారుడు రెండు వైపులా వేర్వేరు డిజైన్లు, వేర్వేరు రంగులు కలిగిన ఇక్కత్‌పట్టు చీరను సృష్టించాడు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన సాయిని భరత్ అనే యువ చేనేత కళాకారుడు అద్భుత కళ రూపాలను రూపొందిస్తున్నాడు. ఎంటెక్ చేసిన సాయిని భరత్ కు చేనేత పై ఎంతో మక్కువ. అంది వస్తున్న టెక్నాలజీ సహాయంతో చేనేత రంగంలో అద్భుతాలు సృష్టించాలని ప్రయత్నించాడు. ఇందులో భాగంగానే కొన్నేళ్ల క్రితం భరత్ మొదటి సారిగా రెండు వేర్వేరు రంగులు, డిజైన్లు కలిగిన ఇక్కత్ దుపట్టాను మగ్గంపై తయారు చేశారు. ఎంతో కళాత్మకంగా దుపట్టాను రూపొందించి నందుకు గాను 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ మెరిట్ సర్టిఫికెట్ అందుకున్నారు. అదే స్ఫూర్తితో ఇక్కత్ కీర్తిని ఖండాంతరం చేయాలని రెండున్నర ఏళ్లు కష్టపడి, ఎంతో సృజనాత్మకంగా ఆలోచించి ఒక చీరకు వేర్వేరు డిజైన్లు, రంగులు వచ్చేలా అభివృద్ధి చేశారు.అనంతరం టై అండ్ డై డిజైనింగ్, మగ్గంతో పాటు వీవింగ్‌లో సైతం ప్రత్యేకమైన పరిజ్ఞానాన్ని వినియోగించి 15 రోజులు మగ్గంపై నేసి రెండు వైపులా వేర్వేరు డిజైన్లు, రంగులు కలిగిన ఉల్టా లేని పట్టు చీరను తయారు చేశారు. దీంతోపాటు కొత్త డిజైన్లతో 3 శాంపిల్ ఇక్కత్ పట్టుచీరలను రూపొందించారు. వీటికి పేటెంట్ కోసం భరత్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కత్‌లో సాధ్యం కాని ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి.. పరిశ్రమకు కొత్త ఇమేజ్ తీసుకొస్తున్న భరత్ ప్రతిభను కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులు, స్థానికులు ప్రశంసిస్తున్నారు. పట్టుచీరలే కాకుండా భవిష్యత్తులో ఫర్నిషింగ్ వస్త్రాలనూ రూపొందించనున్నట్లు భరత్ తెలిపారు.