Karimnagar:నత్తనడకన మానేరు రివర్ ఫ్రంట్ పనులు

Manor River Print

జిల్లాల పునఃర్విభజనతో చారిత్రక, పర్యాటక ప్రాధాన్యతను కోల్పోయిన కరీంనగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం మానేర్ రివర్ ప్రంట్ మంజూరు చేసింది.‌ 470 కోట్లు మంజూరు చేసి మానేర్ తీరాన్ని మరో సబర్మతిలా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందించింది. మానేర్ వాగులో బోటింగ్, థీమ్ పార్క్, ఎల్ఎండీలో కేసీఆర్ ఐలాండ్ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు.

నత్తనడకన మానేరు రివర్ ఫ్రంట్ పనులు

కరీంనగర్, జనవరి 17
జిల్లాల పునఃర్విభజనతో చారిత్రక, పర్యాటక ప్రాధాన్యతను కోల్పోయిన కరీంనగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం మానేర్ రివర్ ప్రంట్ మంజూరు చేసింది.‌ 470 కోట్లు మంజూరు చేసి మానేర్ తీరాన్ని మరో సబర్మతిలా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందించింది. మానేర్ వాగులో బోటింగ్, థీమ్ పార్క్, ఎల్ఎండీలో కేసీఆర్ ఐలాండ్ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. రివర్ ఫ్రంట్ పనులు చేపట్టి ఏడాది లో పూర్తి చేయాలని సంకల్పించారు. అంతలోనే ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడంతో మణిహారం అనుకున్న మానేర్ రివర్ ఫ్రంట్ పనులు మరుగునపడ్డాయి.మానేర్ నది ప్రధాన గేట్ల దిగువన దాదాపు 3 కి.మీ మేర నిర్మించే మానేర్ రివర్ంట్ ఫ్రంట్ పనుల ప్రగతిలో ఆరంభ శూనత్వమనేది స్పష్టంగా కనిపిస్తోంది. దాని నిర్మాణానికి రూ.470 కోట్లను వెచ్చించాలనుకున్నారు. నీటిపారుదల, పర్యాటక శాఖలు నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి. ఇరువైపులా మట్టి, రాళ్లను నింపే పని మాత్రమే పూర్తయింది. మొదటి దశ పనుల్లో భాగంగా దాదాపు 74 శాతం పని పూర్తయినట్లు అధి కారులు చెబుతున్నారు. ఇందుకోసం రూ. 201 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది మే నాటికి ఈ మొదటి దశ పనులు పూర్తికావాల్సి ఉండగా.. వచ్చే ఏడాది నాటికి కొలిక్కి వచ్చే వీలుంది.మానేర్ డ్యామ్ గేట్ల నుంచి చేగుర్తి వరకు ఐదు చెక్ డ్యామ్ లు నిర్మించి 12 ఫీట్ల వరకు నీటి నిల్వచేసి ఓటింగ్ ఏర్పాటు చేయాలని మానేర్ రివర్ ఫ్రంట్ లక్ష్యం.

ఈ చెక్ డ్యామ్ లు ఆరు నెలల కిందటే పూర్తి చేయాలి. సకాలంలో పూర్తి చేయకపోవడంతో ఇనుప చువ్వలు ఉండిపోయాయి. పిల్లర్ల నిర్మాణాన్ని ఇంకా చేపట్టాల్సి ఉంది. మొత్తంగా 15 ఫిల్లర్లలో ఒకదాన్ని మాత్రం సిమెంట్ తో నిర్మించి వదిలేశారు. దీన్ని పూర్తి చేస్తేనే పర్యాటకుల ఆహ్లాదానికి అవకాశం ఉంటుంది. పైగా ఇరువైపులా నిర్మించిన మట్టి కట్టలో ఒకవైపు 32 బ్లాక్స్ పూర్తి కాగా, మరో వైపు ఇంకా సగం మట్టి, రాళ్లు నింపాల్సి ఉంది.ఇటీవల మళ్లీ మిగులు పనుల కోసం రూ.234 కోట్లు విడుదలయ్యాయి. వీటితో రెండో దశ పనులను చేపట్టబోతున్నారు. గతంలో నిర్మించకుండా వదిలేసిన మురుగు, వరదకాలువల కోసం రూ.60 కోట్లు వెచ్చించబోతున్నారు. మిగతా మొత్తాన్ని చెక్ డ్యామ్ నిర్మాణంతోపాటు మిగతా నింపాల్సిన మట్టి, రాళ్ల కోసం వెచ్చిస్తారు. మొదట్లో ఈ రివర్ ఫ్రంట్ పనుల అంచనా రూ. 410 కోట్లు అని ప్రారంభించగా.. తర్వాత ఈ వ్యయం విలువ రూ.470 కోట్లకు చేరింది. ఈ నిధులు పూర్తి స్థాయి పనులకు సరిపోవనేది స్పష్టమవుతోంది. ఫౌంటెయిన్ నిర్మాణంతోపాటు పర్యాటక శాఖ తరపున చేపట్టాల్సిన వాటికి కూడా నిధులు అవసరమవుతాయినగరంలో నుంచి వెలువడే మురుగంతా.. మానేరు రివర్ంట్ లోకే వెళ్తుంది. రాంపూర్, అంబేడ్కర్ మైదానం, శనివారం మార్కెట్ ప్రాంతాల నుంచి ఉన్న నాలాలన్నీ ఇందులో కలుస్తాయి. వాస్తవానికి ఇరువైపులా కట్టను నిర్మించడానికి ముందుగానేపాత వంతెన నుంచి తీగల వంతెన అవతలి వరకు మురుగు, వాన నీరు వెళ్లే కాలువ నిర్మించాలి. అలా చేయకుండానే మట్టి, రాతికట్టడాలను నిర్మించడంతో ఇబ్బంది నెలకొంది. మురుగును శుద్ధి చేయకుండానే మానేరులోకి వదిలితే పరివాహక ప్రాంత రైతులకు.. పర్యాటకులకు వాసన ముప్పు తప్పదు.

కరీంనగర్, సదాశివపల్లి, అలుగునూర్ల నుంచి వెలువడే వ్యర్థాల విషయంలో అవసరమైన మార్పులు చేపట్టాలి.మానేర్ వాగుపై హౌజింగ్ బోర్డు కాలనీ నుంచి సదాశివ్ పల్లి వరకు అర కిలోమీటర్ పొడవునా 183 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మించారు. కొద్ది రోజులు వినోదం కార్యక్రమాలు నిర్వహించారు. అనతి కాలంలోనే కేబుల్ బ్రిడ్జిపై తార్ కొట్టుకుపోయింది. నాణ్యత లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జిగేల్ మనిపించిన లైట్లు వెలగక చీకట్లు అలుముకున్నాయి. కేబుల్ దొంగలు ఎత్తుకెళ్లారు. రెండు కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం అయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.దీనిపై కాంగ్రెస్ గతంలో ఆందోళనకు దిగి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో విచారణ చేపట్టి కాంట్రాక్టర్ నుంచి రెండు కోట్ల వరకు రికవరీ చేసే పనిలో నిమగ్నమయింది. ప్రస్తుతం ఆర్ఎంపి పర్యవేక్షణలో తీగల వంతెన ఉండగా దాన్ని నగరపాలక సంస్థకు లేదా సుడాకు అప్పగించే సన్నాహాలు జరుగుతున్నాయిమరోవైపు మానేర్ తీరాన డంపింగ్ యార్డ్ పెద్ద సమస్యగా మారింది. డంపింగ్ యార్డ్ వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయాలని నిర్ణయించినా ఇప్పటికీ ఎక్కడ సరైన స్థలం దొరక్క అక్కడే డంపింగ్ యార్డ్ చెత్తను శుద్ధిచేసి వినియోగంలోకి తెచ్చేందుకు 16 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశారు. అది ఇప్పుడు పాలకుల చిత్తశుద్ధిని వేలెత్తి చూపుతూ రావణా కాష్టంలా మండుతూ పొగతో స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. పొగతో శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నామని డంపింగ్ యార్డ్ ను వెంటనే వేరే ప్రాంతం తరలించాలని స్థానికులు కోరుతున్నారు. మానేర్ రివర్ ప్రంట్ లో భాగంగా తక్షణమే డంపింగ్ యార్డ్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.మానేర్ రివర్ ఫ్రంట్ పనుల జాప్యానికి గత పాలకులే కారణమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. నాణ్యతా లోపంతో పనులు చేపట్టి అవకతవకలకు పాల్పడడమే కారణం అంటున్నారు. విచారణ జరిపించి బాద్యుల నుంచి డబ్బులను రికవరీ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రణాళికబద్ధంగా మానేర్ రివర్ ఫ్రంట్ పనులను పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుందని నరేందర్ రెడ్డి చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో డ్రైనేజీ కాలువలు తోపాటు నిలిచిపోయిన మానేరు నది ఇరువైపుల నిలిచిపోయిన మట్టి,రాతి కట్ట పనులను పూర్తి చేయిస్తామని తెలిపారు.
Read:Vijayawada:సంక్రాంతి బరిలో 3 వేల కోట్ల పందేలు

Related posts

Leave a Comment