Karimnagar:టచ్ చేస్తే.. సౌండ్

Ramagundam Commissionerate Police has made sensor siren lock available to check thefts

చోరీలకు చెక్ పెట్టేలా రామగుండం కమిషనరేట్ పోలీసులు సెన్సార్ సైరన్ లాక్ అందుబాటులోకి తెచ్చారు. ఇళ్లకు తాళాలు వేసి బయటికి వెళ్లేవారు చోరీ జరగకుండా ఉండేందుకు సెన్సార్ సైరన్ లాక్ ఏర్పాటు చేస్తే చోరీలకు చెక్ పెట్టవచ్చని రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు.

టచ్ చేస్తే.. సౌండ్..

కరీంనగర్, జనవరి 20
చోరీలకు చెక్ పెట్టేలా రామగుండం కమిషనరేట్ పోలీసులు సెన్సార్ సైరన్ లాక్ అందుబాటులోకి తెచ్చారు. ఇళ్లకు తాళాలు వేసి బయటికి వెళ్లేవారు చోరీ జరగకుండా ఉండేందుకు సెన్సార్ సైరన్ లాక్ ఏర్పాటు చేస్తే చోరీలకు చెక్ పెట్టవచ్చని రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. చోరీలకు చెక్ పెట్టేలా రామగుండం కమిషనరేట్ పోలీసులు సరికొత్త లాక్ కు తెరపైకి తెచ్చారు. సెన్సార్ సైరన్ లాక్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఇళ్లకు తాళాలు వేసి బయటికి వెళ్లేవారు చోరీ జరగకుండా ఉండేందుకు సెన్సార్ సైరన్ లాక్ ఏర్పాటు చేస్తే చోరీలకు చెక్ పెట్టవచ్చని రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల కాలంలో ఇళ్లలో షాప్ లలో చోరీలు పెరుగుతున్నాయి. ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తూ, పోలీసులకు దొంగలు సవాల్ గా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో చోరీలను అదుపుచేసేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సెన్సార్ సైరన్ లాక్ ను మార్కెట్లోకి తీసుకువచ్చారు.చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద వాటి వరకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ డివైస్ పైనే ఆధారపడి ఉంటున్నాయి. అనునిత్యం జీవన విధానంలో టెక్నాలజీ ఒక భాగంగా ఉంటుంది. సెన్సార్ సైరన్ మీ ఇంటిలోనికి ఎవరైనా చొరబడటానికి ప్రయత్నించినట్లయితే వారి ప్రయత్యాన్ని ఆపేందుకు సెన్సార్ సైరన్ మ్రోగుతుంది. అలారం శబ్దం రావడంతో చుట్టూ పక్కల వారిని కూడా అలర్ట్ చేస్తుంది. తద్వారా దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తి భయపడి తన ప్రయత్నం విరమించుకుంటాడు. నేరాల నియంత్రణలో సాంకేతికత అవసరాన్ని ప్రజలు గుర్తించి వినియోగించుకోవాలని సీపీ కోరారు.

ఇంటికి తాళాలు వేసి బయటకు, ఊర్లకు వెళ్లే వారంతా వివిధ రకాలపరికరాల సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. తద్వారా చోరీలకు పాల్పడే నిందితుల ప్రయత్యాన్ని విరామించుకొనేలా ఆకస్మికంగా వాటి నుంచి వచ్చే అలారం శబ్దంతో భయం కలిగేలా చేస్తుంది.డోర్ అలారాలు చాలా ప్రభావవంతమైన గృహ భద్రతా పరికరాలు, ఎవరైనా మీ ఇంటి తలుపులు తెరిస్తే లేదా తెరవడానికి ప్రయత్నించినప్పుడు అలారం సౌండ్ తో హెచ్చరిస్తాయి. మీరు మీ ఇంటిలోని అన్ని డోర్‌లకు (గ్యారేజ్ డోర్స్, సైడ్ బ్యాక్ డోర్స్, గ్లాస్ గార్డెన్ డోర్స్, సెల్లార్ డోర్స్, సేఫ్ డోర్స్, కార్యాలయాలు, గిడ్డంగులు, కర్మాగారాలు వంటి పారిశ్రామిక ప్రాంతాలు, నివాస గృహాలు, గ్యారేజీలు, దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లతో సహా వాణిజ్య ప్రాంగణాలు, ఏదైనా నిల్వ ఉంచే సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో మొదలైనవి) డోర్, విండో అలారాలను అటాచ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఇంటి చుట్టూ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ కిటికీలపై విండో అలారాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ అలారం సెక్యూరిటీ గ్యాడ్జెట్‌ అలారం సిస్టమ్‌, బజర్‌, బ్యాటరి లు లభిస్తాయి. దీనిని ఎలా ఉపయోగించాలి అనేది సొంతంగా యూట్యూబ్‌లో వీడియోలు చూసి తెలుసుకోవచ్చన్నారు. దీని బజర్‌ ఏకంగా 105 నుంచి 110 వరకు డీబీతో మోగుతుంది. చాలా దూరం వరకు ఈ సౌండ్ స్పష్టంగా వినిపిస్తుంది. దీంతో ఎవరైనా లాక్ ,డోర్,విండో తెరిచే ప్రయత్నం చేస్తే వెంటనే అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుంది.అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి తదితర ఈ కామర్స్‌ సైట్స్‌లో ఈ యాంటీ థెఫ్ట్‌ అలారాలు అందుబాటులో ఉన్నాయి. ధర విషయానికొస్తే కంపెనీ బట్టి రూ. 300 నుంచి రూ. 500లో ఈ గ్యాడ్జెట్స్‌ అందుబాటులో ఉన్నాయి. సెన్సార్ సైరన్ లాక్ ఏ విధంగా పనిచేస్తుందో మీడియా సమావేశంలో సీపీ వివరించారు.

Read:Hyderabad:ఢిల్లీకి బిల్లుల ఫిర్యాదులు

Related posts

Leave a Comment