మనం కప్పులో టీ తాగుతాం. ఆ కప్పు ప్లాస్టిక్‌ది అయితే పడేస్తాం. స్టీల్ లేదా గ్లాస్ లేదా మట్టితో చేసింది అయితే.. కడిగి జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. కానీ ఇప్పుడు తినే ఎడిబుల్ కప్స్ మార్కెట్లోకి వచ్చాయి. టీ తాగాక ఆ కప్‌ను తినేయవచ్చు. అలాంటి కప్పులు కరీంనగర్ జిల్లాలోనే తయారు చేస్తున్నారు.కరీంనగర్ జిల్లా మానకొండూర్ రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ఆధ్వర్యంలో.. అన్నారం గ్రామంలో ఎడిబుల్ టీ కప్స్ తయారీ కేంద్రాన్ని స్థాపించారు. ఇటీవల జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఓ సమావేశానికి సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, డైరెక్టర్లు హాజరయ్యారు.
కరీంనగర్ లో ఎడిబుల్ కప్స్
కరీంనగర్, డిసెంబర్ 27
మనం కప్పులో టీ తాగుతాం. ఆ కప్పు ప్లాస్టిక్‌ది అయితే పడేస్తాం. స్టీల్ లేదా గ్లాస్ లేదా మట్టితో చేసింది అయితే.. కడిగి జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. కానీ ఇప్పుడు తినే ఎడిబుల్ కప్స్ మార్కెట్లోకి వచ్చాయి. టీ తాగాక ఆ కప్‌ను తినేయవచ్చు. అలాంటి కప్పులు కరీంనగర్ జిల్లాలోనే తయారు చేస్తున్నారు.కరీంనగర్ జిల్లా మానకొండూర్ రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ఆధ్వర్యంలో.. అన్నారం గ్రామంలో ఎడిబుల్ టీ కప్స్ తయారీ కేంద్రాన్ని స్థాపించారు. ఇటీవల జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఓ సమావేశానికి సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, డైరెక్టర్లు హాజరయ్యారు. అక్కడ ఎడిబుల్ కప్పులో టీ పోశారు. ఇవేవో బాగున్నాయనిపించి ఎక్కడ నుంచి తెప్పిస్తున్నారని అడిగారు.రాజమండ్రి నుంచి ఈ టీ కప్పులను సరఫరా చేసుకుంటున్నారని తెలుసుని.. వెయ్యి కప్పులకు ఆర్డర్ పెట్టారు. జిల్లాలోని ఆసుపత్రులు, బ్యాంకులు, సామాజిక వ్యక్తులు, పెద్ద పెద్ద హోటళ్ల నిర్వాహకులను కలిసి వాటిని చూపించారు. మంచి స్పందన రావడంతో.. సహకార సంఘం ఆధ్వర్యంలో అన్నారంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.మూలధనం రూ.3.75 లక్షలతో మిషన్‌ను, లక్ష రూపాయలతో తయారీ సామగ్రిని కొనుగోలు చేశారు. మూడు నెలల కిందట ఎడిబుల్ టీ కప్పుల తయారీ కేంద్రాన్ని ప్రారంబించారు. ఒక్క గ్లాసుకు 3.5 రూపాయలు ఖర్చవుతుండగా.. నాలుగు రూపాయలకు అమ్ముతున్నారు. కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, నల్లగొండ, సంగారెడ్డి, మహబూబ్ నగర్, పెద్దపల్లి జిల్లాల్లో హోటల్లో ఆర్డర్స్‌పై ఈ కప్పులను సరఫరా చేస్తున్నారు.
ఇది రాష్ట్రంలోనే మొదటి ఎడిబుల్ కప్పుల తయారీ కేంద్రం కావడం విశేషం.కప్పులను చిరుధాన్యాలు రాగులు, మొక్కజొన్న పిండి, బియ్యంపిండి, మైదా పిండిలో తగినంత చక్కెరను కలిపి తయారు చేస్తుంటారు. రోజుకు వెయ్యి గ్లాసులను తయారు చేసేందుకు 40 కిలో పిండి అవసరముంటుంది. 10 గ్లాసులను ఒక్క ప్యాకెట్‌గా తయారు చేసి.. 40 రూపాయలకు విక్రయిస్తుంటారు. విద్యుత్ సరఫరా సక్రమంగా ఉంటే రోజుకు వెయ్యి గ్లాసులకు తయారు చేస్తారు.తయారు చేసిన గ్లాసులను ప్యాకింగ్ చేసి ఆర్డర్స్ పై సరఫరా చేస్తారు. ప్రస్తుతం ఒక్క గ్లాసుకు 50 పైసల లాభం వస్తోంది. మార్కెట్ పుంజుకుంటే అప్పుడు ధరను నిర్ణయిస్తామని నిర్వాహకులు తెలిపారు. గతంలో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటిలో స్టాల్స్ ఏర్పాటు చేస్తే మంచి స్పందన వచ్చింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కాగా.. ఆయన సహకారం సంఘ పాలకవర్గాన్ని అభినందించి ప్రోత్సహించారు.ఈ కప్పులో టీ తాగడమే కాకుండా కప్పును తినవచ్చు. తినక పడేసినా అది తొందరగా భూమిలో కలిసిపోతుంది. పేపర్ గ్లాసులో టీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మిషన్‌లో పిండిని నింపేటప్పుడు దాని మీద పడ్డ పిండి.. గ్లాసు తయారు అయిన తర్వాత వేస్ట్ రూపంలో కిందపడుతుంది. దాన్ని ఆవులు, గేదలకు వేస్తే ఎంతో ఇష్టంగా తింటున్నాయని నిర్వాహకులు తెలిపారు.అన్నారం గ్రామంలో రైతు సహకారం సంఘం అధ్వర్యంలో మూడు నెలల కిందట టీ కప్పు తయారీ కేంద్రాన్ని నెలకొల్పామని.. త్వరగానే మార్కెట్ పుంజుకుందని రైతు సహకార సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి చెబుతున్నారు. ప్రస్తుతం ఎనిమిది జిల్లాలకు సరఫరా చేస్తున్నామని.. ఇందులో టీ తాగడం ఆరోగ్యానికి మంచిదన్నారు. త్వరలో మొక్కజొన్న పిండి, గమ్ ఇస్తారాకుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు.