ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యాటక రంగం పరిఢవిల్లుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాలకు రాష్ట్రం నలుమూలల నుంచి సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ప్రజా రవాణా వ్యవస్థతోపాటు వ్యక్తిగత రవాణా వాహనాల సౌకర్యం పెరగడంతో.. పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. శ్రావణ మాసంతోపాటు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పర్యాటకులు పెరగడానికి కారణమని తెలుస్తోంది.పర్యాటక శాఖ తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం.. ఎక్కువ మంది పర్యాటకులు వచ్చిన ప్రదేశాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉండగా జగిత్యాల ఐదో స్థానంలో నిలిచాయి.
కరీంనగర్ జిల్లాకు పర్యాటక ఊపు
కరీంనగర్, డిసెంబర్ 30
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యాటక రంగం పరిఢవిల్లుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాలకు రాష్ట్రం నలుమూలల నుంచి సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ప్రజా రవాణా వ్యవస్థతోపాటు వ్యక్తిగత రవాణా వాహనాల సౌకర్యం పెరగడంతో.. పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. శ్రావణ మాసంతోపాటు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పర్యాటకులు పెరగడానికి కారణమని తెలుస్తోంది.పర్యాటక శాఖ తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం.. ఎక్కువ మంది పర్యాటకులు వచ్చిన ప్రదేశాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉండగా జగిత్యాల ఐదో స్థానంలో నిలిచాయి. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గత ఏడాది 65 లక్షల 76 వేల 73 మంది పర్యాటకులు వస్తే.. ఈ సంవత్సరం ఒక కోటి 64 లక్షల 53 వేల 235 మంది సందర్శించారు.ఈ ఏడాది 8 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రదేశాలకు 6.51 కోట్ల మంది వెళ్లగా.. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చినవారే 1.27 కోట్ల వరకున్నారు. మొత్తం పర్యాటకుల్లో ఇక్కడికి వచ్చినవారే దాదాపు 20 శాతం.వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉండటం రాజన్న సిరిసిల్ల జిల్లాకు, కొండగట్టు, ధర్మ పురి దేవస్థానాలు ఉండటం జగిత్యాల జిల్లాకు కలిసొచ్చింది. వచ్చిన పర్యాటకుల్లో 62 శాతం మహిళలున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వీరికి కలిసొచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉమ్మడి జిల్లాకు వచ్చిన పర్యాటకుల సంఖ్య దాదాపుగా మూడింతలకు పెరిగిందఇప్పటికే ఈ ఏడాదిలో కోటిన్నరకు పైగా సందర్శకులు ఉమ్మడి జిల్లాకు వచ్చారు. 2024 సంవత్సరంలో ఆగస్టు వరకు ఉమ్మడి జిల్లాకు ఏకంగా 1,64,53,235 మంది వచ్చారు. ఈ ఏడాది నెలకు సగటున 20 లక్షలకు పైగా వస్తున్నారు. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో మరో 80 లక్షల మంది నాలుగు జిల్లాలకు వచ్చారని అంచనా. గతేడాది జనవరి నుంచి ఆగస్టు వరకు వచ్చిన వారు 65.76 లక్షలు ఉండగా.. ఈసారి ఆదే ఎనిమిది నెలల వ్యవధిలో 1.64 కోట్ల మంది ఉమ్మడి జిల్లాకు రావడం విశేషం.
హైదరాబాద్‌కు 160 కి.మీ.ల దూరమే ఉండటం, రాజీవ్ రహదారి అనుకూలంగా మారడం, ప్రతి 10 నిమిషాలకో బస్సు సౌకర్యం ఉండటంతో ఎక్కువ మంది రాగలుగుతున్నారు. ఇటు వరంగల్, అటు సిద్దిపేట జిల్లాలోని దేవాలయాలకు వచ్చిన వారు రాజన్న ఆలయానికి, కొండగట్టుకు వచ్చి వెళ్తుంటారు. శుభకార్యాలకు వచ్చినవారు ఇక్కడి ప్రాంతాల్ని చూస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర జరగింది. అక్కడికి వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజరాజేశ్వర దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఇది ఉమ్మడి కరీంనగర్ పాటు చుట్టుపక్కల జిల్లాల భక్తులకు ఆనవాయితీ. ఈ కారణంగా కూడా పర్యాటకుల తాకిడి పెరిగింది.మాసంలో జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కోటిలింగాల దేవాలయాలకు ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో ఈ సారి సందడి కనిపించింది. హనుమాన్ దీక్షాపరులు కొండగట్టుకు ఎక్కువగా విచ్చేయడంతో ఈసారి భక్తుల తాకిడి పెరిగింది. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ సందర్శనకు పర్యాటకులు వచ్చారు.వర్షాకాలంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువ, మధ్య మానేరు జలాశయాలు, కరీంనగర్ జిల్లా దిగువ మానేరు జలాశయాలకు కూడా పర్యాటకుల తాకిడి పెరిగింది. వరదలతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో.. పరవళ్లను వీక్షించడానికి పెద్దఎత్తున తరలివచ్చారు.