సీఎం చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటీ
విజయవాడ, అక్టోబరు 29, (న్యూస్ పల్స్)
Kapil Dev Chandrababu
ఏపీలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటు అవుతుందా? ఇప్పటికే ఒకటి విశాఖలో ఉంది. మరొకటి అమరావతిలో ప్లాన్ చేస్తున్నారా? సీఎం చంద్రబాబుతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్దేవ్ భేటీకి కారణమేంటి? గతంలో తెచ్చిన ప్రొగ్రాంను తెరపైకి తెస్తున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడుతోంది.
అమరావతిలో సీఎం చంద్రబాబుతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్దేవ్ సమావేశమయ్యారు. గతరాత్రి విజయవాడకు చేరుకున్న ఆయన, మంగళవారం సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం విశాఖలోని ముడసర్లోవ ప్రాంతంలో గోల్ప్ కోర్టు ఉంది. అలాంటిది అమరావతిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. 2014-19 మధ్య కాలంలో గ్రామీణ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చేందుకు ఓ ప్రోగ్రాం ప్రవేశపెట్టారు.
ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చిన తర్వాత ఏపీలో ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. దీంతో మూలన పడిపోయింది. దాన్ని మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
CM Chandrababu | పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం.. సీఎం చంద్రబాబు | Eeroju news