Kakinada:వాక్‌విత్‌ నేషన్‌

Kakinada JNTU

కాకినాడ జేఎన్‌టీయూ అంటే సాంకేతిక విద్యలో తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. ఇక్కడ చదివిన ఎంతో మంది సాంకేతిక రంగాల్లో ఎనలేని కీర్తిని సంపాదించిన వారు ఉన్నారు. వేల మంది దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అటువంటి కీర్తిప్రతిష్టలు కలిగిన కాకినాడ జేఎన్‌టీయూ అభివృద్ధిపరంగానే కాకుండా యూనివర్సిటీ ప్రత్యేకతను చూపించేందుకు చాలా మంది పూర్వవిద్యార్థులు తమ భాగస్వామ్యపాత్ర పోషిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దేశంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ కనిపించని విధంగా జేఎన్‌టీయూకేలో ఏకంగా 194 దేశాల జాతీయపతాకాలను ఏర్పాటు చేసి ఆవిష్కరించారు.

వాక్‌విత్‌ నేషన్‌….

కాకినాడ, డిసెంబర్ 28
కాకినాడ జేఎన్‌టీయూ అంటే సాంకేతిక విద్యలో తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. ఇక్కడ చదివిన ఎంతో మంది సాంకేతిక రంగాల్లో ఎనలేని కీర్తిని సంపాదించిన వారు ఉన్నారు. వేల మంది దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అటువంటి కీర్తిప్రతిష్టలు కలిగిన కాకినాడ జేఎన్‌టీయూ అభివృద్ధిపరంగానే కాకుండా యూనివర్సిటీ ప్రత్యేకతను చూపించేందుకు చాలా మంది పూర్వవిద్యార్థులు తమ భాగస్వామ్యపాత్ర పోషిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దేశంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ కనిపించని విధంగా జేఎన్‌టీయూకేలో ఏకంగా 194 దేశాల జాతీయపతాకాలను ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. జెనీవా, న్యూయార్క్‌, సియోల్‌, షాంఘై, శాంటోడోమింగ్‌లో ఉండే జాతీయ పతాకాల సమ్మేళనం మన దేశంలో తొలిసారిగా కాకినాడ జేఎన్‌టీయూలో ఏర్పాటుచేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీటిని ఇన్‌చార్జ్‌ వైస్‌ ఛాన్సలర్‌ కేవీఎస్‌జీ మురళీకృష్ణ ఆవిష్కరించారు. జేఎన్‌టీయూకే ప్రాంగణంలో 194 దేశాల జెండాలు ఆవిష్కరించడం వెనుక పూర్వవిద్యార్ధి, సుందర్‌ అసోసియేట్స్‌ ఛైర్మన్‌ బాదం సుందరరావు ఉన్నారు. ఆయన సహకారంతో వాక్‌విత్‌ నేషన్స్‌ పేరుతో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చేసిన ఈ జెండాల ఏర్పాటు వెనుక ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రం స్ఫూర్తి ఉందని వీసీ మురళీ కృష్ణ తెలిపారు. వసుదైక కుటుంబమే దీని ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. పూర్వ విద్యార్ధిగా తన విశ్వవిద్యాలయంలో ఈ 194 జెండాల ప్రాజెక్టును సొంత ఖర్చుతో ఏర్పాటు చేసినట్లు పూర్వవిద్యార్ధి బాదం సుందరరావు తెలిపారు. జేఎన్‌టీయూకే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 194 దేశాల జెండాల వివరాలు తెలుసుకునేలా ప్రతీ జెండా స్తంభానికి ఒక క్యూ ఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశారు. అంత‌ర్జాతీయ స‌మైక్యత నినాద‌మే కాకుండా అంత‌ర్జాతీయ ఐక్యరాజ్యసమితిలో గుర్తింపు పొందిన దేశ పరిస్థితులు తెలుసుకోవ‌చ్చు. దీనిని స్కాన్‌ చేస్తే ఆ జెండా. దేశం వివరాలు అన్నీ తెలుసుకోవచ్చు. ఇవ‌న్నీ స‌మాన ఎత్తులో ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా అక్షర క్రమంలో ఉంచారు. దేశ భౌగోళిక పరిస్థితి, క‌రెన్సీ, ఇత‌ర వివ‌రాలు ఈ క్యూ ఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 194 దేశాల జెండాలు రెపరెపలాడుతూ అందరి దృష్టిని ఆకర్షించాయి.

Read:Imtiaz Ahmed:వైసీపీకీ ఇంతియాజ్ రాజీనామా

Related posts

Leave a Comment