ఆడింది.. వారు.. ఆడించింది రాజకీయ ప్రముఖులు.. కానీ బుక్ అయ్యింది మాత్రం సామాన్యులు.. అదికూడా పనివాళ్లు.. తెలుగువారి పెద్దపండుగ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మూడు రోజుల పాటు నిర్వహించిన కోడిపందేలుకు సంబందించి కోడిపందేల వద్ద కత్తులు కట్టేవారు.
కోడిపందేలు.. సామాన్యులపై కేసులు
ఇదెక్కడి చోద్యం
కాకినాడ, జనవరి 18
ఆడింది.. వారు.. ఆడించింది రాజకీయ ప్రముఖులు.. కానీ బుక్ అయ్యింది మాత్రం సామాన్యులు.. అదికూడా పనివాళ్లు.. తెలుగువారి పెద్దపండుగ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మూడు రోజుల పాటు నిర్వహించిన కోడిపందేలుకు సంబందించి కోడిపందేల వద్ద కత్తులు కట్టేవారు.. అక్కడ రోజు కూలీకోసం పనిచేసిన వారు కేసుల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 1200 మందిపై బైండోవర్ కేసులు నమోదు కాగా ఎక్కువశాతం మంది సామాన్యులే బలయ్యారన్నది వాస్తవంగా కనిపిస్తోంది.ముందెప్పుడూ లేనంతగా ఈ ఏడాది కోడిపందేలు జోరుగా సాగాయి. ఉభయగోదావరి జిల్లాల్లో ఊరికి పది చొప్పున అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా కోడిపందేలు బరులు ఏర్పాటు చేశారు. ఇక వాటి చెంతనే గుండాటలు, ఇతర జూదాలు, కొన్నిచోట్ల ఏకంగా క్యాసినోలు కూడా నిర్వహించారు. పోలీసుల ఆంక్షలు మాట అటుంచితే ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా కోడిపందేలు, జూదాలు జరగ్గా కోట్లాది రూపాయలు చేతులు మారాయి.కోడిపందేల నిర్వాహణకు ముందు నెల రోజుల నుంచి పోలీసులు గతంలో కోడిపందేలు ఆడుతున్నవారి మీద ఉన్న కేసులు ఆధారంగా, గుండాటలు నిర్వహించే వారిపై నమోదైన కేసులు ఆధారంగా బైండోవర్లు నమోదు చేశారు. అయితే వీరిలో అంతా కూడా సామాన్యులు, కూలినాలీ చేసుకునేవారు, కోళ్ల పోషణను చూసి వాటికి కత్తులు కట్టేవారే ఉన్నారు.గోదావరి జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ఈ ఏడాది భారీ ఎత్తున కోడిపందేలు నిర్వహించారు. వీటి వెనుక ప్రతీ మండల పరిధిలో, గ్రామ పరిధిలోనూ రాజకీయ నాయకులు ఉన్నారు. వారిపై ఒక్క కేసు నమోదు కాని పరిస్థితి కనిపించింది. పైగా కోడిపందేల బరులను వీరే దగ్గరుండి ట్రాక్టర్లుతో చదును చేయించి ఆపై అక్కడ షామియానాలు ఏర్పాటు చేయించారు. పైగా బరుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ వారి పేర్లు వేయించుకున్నారు. అయినా వీరిపై కేసులు నమోదు కాకపోవడం విమర్శలపాలవుతోంది. ఈ ఏడాది ఎక్కడ బడితే అక్కడ విచ్చలవిడిగా కోడిపందేలు నిర్వహించడంతో చాలా మంది అప్పులు చేసి, ఆస్తులు తాకట్టుపెట్టి మరీ లక్షలు పోగొట్టుకున్న పరిస్థితి కనిపించిందని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా భీమవరం, కాకినాడ, మురముళ్ల ప్రాంతాల్లో చాలా మంది ఆస్తులను కూడా పందేల్లో బెట్టింగ్ పెట్టి పోగొట్టుకున్నారని తెలుస్తోంది. భీమవరంలో నిర్వహించిన కోడిపందేలలో ప్రతిష్టకు పోయి రెండెకరాల వ్యవసాయ భూమిని పందెంలో వేసి పోగొట్టుకున్నట్లు సమాచారం. ఇలా ప్రతీ చోట అతికి పోయి డబ్బును, డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఆస్తులను పందేలలో పొగొట్టుకున్నారట..
Read:Vijayawada:డీజీపీ రేసులో హరీష్ గుప్తా