Justice Sanjiv Khanna | నవంబర్ 11న సీజేఐ కొత్త బాధ్యతలు | Eeroju news

నవంబర్ 11న సీజేఐ కొత్త బాధ్యతలు

నవంబర్ 11న సీజేఐ కొత్త బాధ్యతలు

న్యూఢిల్లీ, అక్టోబరు 25, (న్యూస్ పల్స్)

Justice Sanjiv Khanna

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో మొదటి ప్యూస్నే న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఖన్నా, ప్రస్తుత సీజేఐ , DY చంద్రచూడ్ పదవీ విరమణ తర్వాత నవంబర్ 11న ఆ పదవిని చేపట్టనున్నారు. చంద్రచూడ్ గతంలో జస్టిస్ ఖన్నా పేరును తుదిపరి ప్రధాన న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేశారు. ప్రస్తుత న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ 65 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన ఒక రోజు తర్వాత, నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 8, 2022న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ ఖన్నా నియామకానికి ప్రభుత్వ ఆమోదాన్ని ధృవీకరిస్తూ, కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ X ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. జస్టిస్ ఖన్నా 183 రోజులు మాత్రమే సీజేఐ ఉండనున్నారు. అంటే ఆయన కేవలం ఆరు నెలలు మాత్రమే ఈ పదవిలో ఉంటారన్నమాట. అతను మే 13, 2025న పదవీ విరమణ చేయనున్నారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి హన్స్ రాజ్ ఖన్నా మేనల్లుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా ADM జబల్‌పూర్ కేసులో ఇచ్చిన తీర్పుతో ఆయన ప్రసిద్ధి చెందాడు.

నవంబర్ 11న సీజేఐ కొత్త బాధ్యతలు

 

 

Supreme headed the Government of Bengal | బెంగాల్ ప్రభుత్వాన్ని తలంటిన సుప్రీం | Eeroju news

Related posts

Leave a Comment