ఉమ్మడి కృష్ణాజిల్లా నూజివీడులో చాలా ఆసక్తికర సంఘటన జరిగింది. వైసిపి కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కూటమి నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రి పార్థసారథితో కలిసి ఊరు మొత్తం ర్యాలీగా తిరిగారు. గౌత లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా టిడిపి నేతలతోపాటు వైసిపి నేత హాజరు కావడంపై ఒక్కసారిగా రాజకీయాల్లో చర్చ మొదలైంది.ఇప్పటికే పలువురు వైసిపి నేతలు 2024 ఎన్నికల ఫలితం తర్వాత జగన్‌కు బై బై చెప్పి కూటమి వైపు అడుగులు వేశారు.
-టీడీపీకి దగ్గరవుతున్న జోగి ?
విజయవాడ, డిసెంబర్ 17, (న్యూస్ పల్స్)
ఉమ్మడి కృష్ణాజిల్లా నూజివీడులో చాలా ఆసక్తికర సంఘటన జరిగింది. వైసిపి కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కూటమి నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రి పార్థసారథితో కలిసి ఊరు మొత్తం ర్యాలీగా తిరిగారు. గౌత లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా టిడిపి నేతలతోపాటు వైసిపి నేత హాజరు కావడంపై ఒక్కసారిగా రాజకీయాల్లో చర్చ మొదలైంది.ఇప్పటికే పలువురు వైసిపి నేతలు 2024 ఎన్నికల ఫలితం తర్వాత జగన్‌కు బై బై చెప్పి కూటమి వైపు అడుగులు వేశారు. వారిలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య లాంటి వారు ఉన్నారు. ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరకపోయినా వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఆళ్ళ నాని,గ్రంధి శ్రీనివాస్,రాపాక వర ప్రసాద్,వాసిరెడ్డి పద్మ లాంటి ప్రముఖులు ఉన్నారు. ఇక పార్థసారథి, లావు శ్రీకృష్ణదేవరాయలు, వసంత కృష్ణ ప్రసాద్ లాంటి వారు ఎన్నికలకు ముందే జగన్‌కు టాటా చెప్పేసి కూటమి వైపు వచ్చేశారు. ఇప్పుడు జోగి రమేష్ కూటమినేతలతో కలిసి కనపడేసరికి ఏపీ పాలిటిక్స్‌లో కొత్త డిస్కషన్ మొదలైంది. సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు అత్యంత విధేయుల్లో ఒకరిగా జోగి రమేష్ మెలిగారు. దానికి తగ్గట్టే ఆయనను మంత్రిని చేసిన జగన్ అప్పటి మైలాపురం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్ మధ్య నెలకొన్న వివాదాల్లో ఇద్దరూ తన పార్టీ వారే అయినా జోగి రమేష్ వైపే నిలబడ్డారు. నూజివీడు నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గం చాలా బలంగా ఉంటుంది. దాదాపు 30 వేల ఓట్లు ఉంటాయి. ఈ సామాజికవర్గం వారు అటు వైసీపీలో ఇటు టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. సంఘం ఆధ్వర్యంలో గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో టీడీపీకి సపోర్ట్ చేసేవారు టీడీపీ నేతలను ఆహ్వానించారు. వైసీపీకి సపోర్ట్ చేసేవారు.. జోగి రమేష్‌ను ఆహ్వానించారు.ఈ కార్యక్రమానికి వారు ఆహ్వానించినట్టు టీడీపీ, వైసీపీ నేతలు హాజరయ్యారు. దీనిపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ.. టీడీపీ మాత్రం సీరియస్ అయ్యింది. ఒకవేళ ఆ కార్యక్రమానికి వెళ్లాల్సి వస్తే.. జోగి రమేష్ వెళ్లిపోయిన తర్వాతనో.. రాకముందో వెళ్లొచ్చు కదా అనే వాదనను స్థానిక టీడీపీ నాయకులు తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల పార్టీకి నష్టం వస్తుందని.. బలమైన కేడర్ పార్టీకి దూరం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారడం వెనక ఇది కూడా ఒక కారణం అని ఆయనే చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేశారన్న ఆరోపణ కూడా జోగి రమేష్ ఎదుర్కొంటున్నారు. దీనిపై నమోదైన కేసులో ఇప్పటికే పోలీసులు జోగి రమేష్‌ను విచారించారు. వీటన్నిటి నేపథ్యంలో గత కొంతకాలంగా జోగి రమేష్ రాజకీయంగా తన స్పీడ్ తగ్గించారు. అయితే ఎప్పుడూ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాత్రం మాట్లాడలేదు.
లోకేష్ ఆగ్రహం…
మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీషలపై టీడీపీ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ మండిపడ్డారు. వారు నూజివీడులో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఆవిష్కరణ ర్యాలీలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఆయన పాల్గొనడంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. ఆయన కొంత కాలంగా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పలు కేసుల్లో ఆయన ఇరుక్కున్నారు. అయితే ఇప్పుడు టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అంటున్నారు. ఇలా జోగి రమేష్ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఆ పార్టీ క్యాడర్ సీరియస్ గా స్పందించింది. దీనికి కారణం జోగి రమేష్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుఇంటిపై దాడికి వెళ్లారు. అలాగే టీడీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. జోగి రమేష్ తీరు అత్యంత ఘోరంగా ఉండటంతో అప్పట్లో టీడీపీ నేతలు మండిపడేవారు. తాము అధికారంలోకి వస్తే జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేసేవారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చేర్చుకుంటున్నారని ఇంకెందుకు.. కొడాలి నాని, వల్లభనేని వంశీలను కూడా చేర్చుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. టీడీపీ కార్యకర్తల ఆగ్రహం నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆసలేం జరిగిందో ఆయన ఆరా తీశారు. నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి అనూహ్యంగా జోగి రమేష్ హాజరయ్యారు. ఆయనను ఎవరు పిలిచారన్నది బయటకు రాలేదు. నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పార్థసారధి ఉండటం, వైసీపీలో ఉన్నప్పుడు ఉన్న పరిచయాల కారణంగా ఆహ్వానించి ఉంటారని భావిస్తున్నారు. సామాజికవర్గ పరంగా ఆలోచించి పిలిచి ఉంటారని ఈ ఇష్యూ ఇంత వరకూ వస్తుందని అనుకోలేదని ఆయన వర్గీయులు అంటున్నారు. మరో వైపు జోగి రమేష్ పై కూడా వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయనను జగన్ మైలవరం ఇంచార్జ్ గా నియమించి చాలా కాలం అయింది. అయితే ఆయన ఇంత వరకూ నియోజకవర్గంలో ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. పార్టీ పరమైన కార్యక్రమాలు కూడా నిర్వహించడంలేదని అంటున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలతో కలిసి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
Read : YSRCP : జమిలీపై వైసీపీ ఆశలు