రాత పరీక్షా లేకుండానే ఉద్యోగాలు ఇవ్వాలి | Jobs should be given without written test | Eeroju news

సీఐటీయూ జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన
కలెక్టరేట్ ఎదుట సిఐటియూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల నిరసన

జగిత్యాల

ఆశా వర్కర్లకు ఎలాంటి రాత పరీక్షా లేకుండానే ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జగిత్యాల జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన ప్రభుత్వాన్ని కోరారు. ఆశాలకు నష్టం కలిగించే  విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని  ఉపసంహరించుకోవాలని సులోచన డిమాండ్ చేశారు.ఆశా వర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ నిరసనకు  సీఐటీయూ నాయకులు పూర్తి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన మాట్లాడుతూ  అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు.

ఆశాలకు టార్గెట్ ఇస్తూ పని ఒత్తిడి తీసుకువస్తూ  మానసిక వేదనకు గురి చేస్తున్న  అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పని భారం తగ్గించే విధంగా జాబ్ చార్జ్  ఉత్తర్వులను ఇవ్వాలని కోరారు.
జీతాలు చెల్లించడంలో ఆలస్యం చేయకుండా ప్రతినెల రెండవ తారీఖునే  అందజేయాలని సులోచన కోరారు. వీటితోపాటు ఆశ వర్కర్ల ఇతర న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సులోచన కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో
ఆశ యూనియన్ అధ్యక్షురాలు ఆత్మకూరి లత, కార్యదర్శి మమత, జిల్లా కమిటీ సభ్యురాళ్లు జీవలక్ష్మి, జ్యోతి, వసంత, సంధ్య, దివ్య, సరిత, రాణి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుపతి నాయక్, వివిధ గ్రామాల  ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment