మార్క్ చూపించేసిన జితేందర్
హైదరాబాద్, జూలై 12, (న్యూస్ పల్స్)
Jitender who showed the mark
తెలంగాణ కొత్త పోలీస్ బాస్‌గా జితేందర్ నియమితులయ్యారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సీనియారిటీ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న జితేందర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కొత్త పోలీస్‌బాస్‌గా నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వెంటనే సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఆయన బాధ్యలు చేపట్టారు. రేవంత్‌రెడ్డి అనుమతి ఇవ్వడంతోనే ఉత్తర్వుల జారీ, బాధ్యతల స్వీకరణ చకచకా జరిగాయి. ఇక కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన జితేందర్ వెంటనే తన మార్కు పాలన మొదలు పెట్టేవారు. తనకు అవసరమైన టీంను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ చేసిన వారిలో కొందరికి కీలక బాధ్యతలు అప్పగించారు గతంలో రాచకొండ కమిషనర్‌గా పని చేసిన మహేష్ భగవత్‌ను శాంతిభద్రతల అదనపు డీజీపీగా బదిలీ చేశారు. ఇక వరంగల్ సీపీగా బాధ్యతలు నిర్వహించిన సుధీర్ బాబును రాచకొండ సీపీగా పదోన్నతి కల్పించారు.తెలంగాణలో పాలనపై దృష్టిపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి ఈమేరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలే ఐఏఎస్ లను బదిలీ చేసిన సీఎం ఇప్పుడు ఐపీఎస్‌లపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఏకంగా పోలీస్‌బాస్‌నే మార్చేశారు. తర్వాత కొత్త పోలీస్ బాస్‌తో 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేయించారు. హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపుగా డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్‌కుమార్‌ను నియమించారు.
ఇక కొత్త డీజీపీ జితేందర్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నాటినుంచి సీఎం రేవంత్‌రెడ్డి పోలీస్ బాస్ మార్పుపై కసరత్తు చేశారు. ఈ క్రమంలో కొందరు సీనియర్ల పేర్లు పరిశీలించారు. అవకాశం మాత్రం అనూహ్యంగా 1992 బ్యాచ్ ఐపీఎస్ జితేందర్‌కు కల్పించారు. డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ డిసెంబర్ 4న అసెంబ్లీ ఫలితాలు వెలువడుతున్న సమయంలో రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఎన్నికల సంఘం అతడిని సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో రవిగుప్తాను డీజీపీగా నియమించింది. తాజాగా జింతేదర్‌ను సీఎం రేవంత్ నియమించారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిననాటి నుంచి పోలీస్ అధికారుల బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. అయితే డీజీపీని మాత్రం సీఎం ఇంతకాలం మార్చలేదు. డీజీపీగా నియమించాలంటే సీనియారిటీ, సమర్థత ముఖ్యం. సీనియారిటీ జాబితాలో 1990 బ్యాచ్‌కు చెందిన రవి గుప్తా ఉన్నాడు. తర్వాత స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌రతన్ ఉండగా ఆయన ఇటీవలే మరణించారు. ఇక మూడో స్థానంలో 1991 బ్యాచ్‌కే చెందిన సీవీ.ఆనంద్ ఉన్నారు. నాలుగో స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన జితేందర్ ఉన్నారు. రాజీవ్ రతన్ తర్వాత ఈయన మూడో స్థానానికి వచ్చారు. రవి గుప్తా తర్వాత సీవీ ఆనంద్‌కు డీజీపీ పదవి రావాలి. కానీ ఆయన గొర్రెల స్కాంతోపాటు పలు కేసుల విచారణలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా జితేందర్ డీజీపీ అయ్యారు. అనుభవం, సమర్థత, వివాద రహితుడు కావడంతోనే సీఎం జితేందర్‌వైపు మొగ్గు చూపారు.ఇదిలా ఉండే డీజీపీ నియామకం కోసం 1993 బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి పేరును కూడా రేవంత్‌రెడ్డి పరిశీలించారు. అయితే ఆయన ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు. డీజీపీ హోదాలో ఉన్న రాజీవ్ రత్ కన్నుమూయడం, సందీప్ శాండిల్య పదవీ విరమణ చేయడంతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. అదనపు డీజీల సీనియారిటీ జాబితాలో ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు. ఈయనతోపాటు శివధర్‌రెడ్డికి డీజీపీగా పదోన్నతి రావాల్సి ఉంది. ప్రక్రియ పూర్తి కాకపోవడంతో లైన్ క్లియర్ కాలేదు.
Chance for four on 4th Expansion of Cabinet Revanth Reddy | 4న నలుగురికి అవకాశం… | Eeroju news