జానీకి బెయిల్ మంజూరు చేసిన కోర్టు!
హైదరాబాద్, అక్టోబరు 3, (న్యూస్ పల్స్)
Jani Master
ప్రముఖ కొరియోగ్రాఫర్, తెలుగు టీవీ అండ్ సినిమా డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ మాస్టర్ కొన్ని రోజుల క్రితం కటకటాల పాలు అయిన సంగతి తెలిసిందే. ఆయన దగ్గర సహాయకురాలిగ పని చేసిన ఒక మహిళా కొరియోగ్రాఫర్ పెట్టిన కేసు నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల కేసుతో పాటు ఫోక్సో చట్టం కింద జానీ మాస్టర్ మీద అభియోగాలు నమోదు అయ్యాయి. తనకు ఐదు రోజుల మద్యంతర బెయిల్ కోరుతో కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు జానీ. తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని.. అందుకు గాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేశారు జానీ.
దీని పై విచారణ జరిపిన కోర్టు జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది.జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం.. జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 8న ఢిల్లీలో అవార్డు జానీ మాస్టర్ అవార్డు తీసుకోనున్నారు.
బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ధనుష్ నటించిన తిరు సినిమా పాటకు నేషనల్ అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకునేందుకు ఐదు రోజుల పాటు బెయిల్‌పై విడుదలయ్యారు జానీ.అయితే… ఈ కేసులో ఆయనకు కాస్త ఊరట లభించింది.అక్టోబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జానీ మాస్టర్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి కారణం ఆయనకు నేషనల్ అవార్డు రావడం!
Madhavi Latha About Jani master | నాగబాబు గారూ మీకూ కూతురు ఉంది..