హిందూ ఫేస్ గా మారుతున్న జనసేనాని….
విజయవాడ, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్)
Jana Sena is becoming a Hindu face
సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఉండాలి.. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృతంగా .. అన్ని వర్గాల్లో చర్చ జరగాలి అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూ వివాదం విషయంలో స్పందించారు. ఈ స్పందన వెనుక లోతైన అర్థం ఉండటంతో పలువురు స్పందించారు. ఇందులో ప్రకాష్ రాజ్ ఒకరు. పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా చేసి.. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఓ బోర్డును ఏర్పాటు చేయాలన్న సూచన చేశారు. ఇలాంటివి వస్తే.. హిందూత్వ రాజకీయాలు చేసే బీజేపీ ఎలా అందుకుంటుందో ప్రకాష్ రాజ్ కు తెలుసు. అందుకే.. అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని శిక్షించాలని సలహా ఇచ్చారు. దీనికి పవన్ రిప్లయ్ ఇవ్వలేదు కానీ .. ఆయన రాజకీయంపై మాత్రం అందరికి ఈ క్లారిటీ వచ్చినట్లయింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విషయంలో వస్తున్న వార్తలు కోట్లాది మంది హిందువుల మనో భావాల్ని దెబ్బతీశాయి. నెయ్యి విషయంలో జరిగన తప్పులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కలిసి పని చేయాలన్నట్లుగా పవన్ కల్యాణ్ స్పందించార.ు సనాతన ధర్మ రక్షణ బోర్డు అనే ఆలోచనను పవన్ కల్యాణ్ ప్రజల ముందు పెట్టారు. ఈ అంశంపై పీఠాధితుపు, న్యాయ, మీడియా వర్గాలతో సహా ప్రజాప్రతినిధులంతా చర్చించాలని కోరారు. ఇలా అందరూ కలిసి సనాతన ధర్మాన్ని రక్షించుకునేందుకు నడుంకట్టేలా చేయాలని పవన్ ఆలోచన చేశారు.
నిజానికి పవన్ కల్యాణ్ తన భావజాలం.. కమ్యూనిజానికి దగ్గరగా ఉంటుందని చాలా సార్లు చెప్పారు. అందుకే ఓ సారి ఆ పార్టీలతో కలిసి పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు. తర్వాత మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు కానీ బీజేపీ రేంజ్ హిందూత్వ వాదాన్ని ఎప్పుడూ వినిపించలేదు. ఇప్పుడు లడ్డూ వివాదంలో మాత్రం సనాతన ధర్మం గురించి మాట్లాడి అందర్నీ ఆశ్చర్య పరిచారు. పవన్ కల్యాణ్ దీర్ఖకాలిక రాజకీయ వ్యూహంతో ముందుడుగు వేస్తున్నారని.. ఆయన ఆలోచనల వెనుక ఖచ్చితంగా బీజేపీ ప్రభావం ఉందని అంటన్నారు. దీనికి కారణం.. దేశంలోని ప్రముఖ అథ్యాత్మిక ఆలాయలు అధ్యాత్మిక వాదుల చేతుల్లోనే ఉండాలని రాజకీయ జోక్యం ఉండకూడదన్న వాదనలు ఉన్నాయి.
ఈ క్రమంలో సనాతన రక్షణ బోర్డు ప్రస్తావనను పవన్ తీసుకు వచ్చారు. ఇది ఏపీకి కాదు.. దేశం మొత్తం గురించి ఆయన తెచ్చిన ప్రస్తావన. లడ్డూ వివాదం నేపధ్యంలో పవన్ పదకొండు రోజుల పాటు.. దీక్ చేయాలని నిర్ణయించుకున్నారు. నంబూరు ఆలయంలో దీక్ష చేపట్టి పదకొండు రోజుల తర్వాత తిరుమలలో దర్శనం చేసుకుంటానన్నారు. ప్రాయశ్చిత్తమని పవన్ అంటున్నారు. రాజకీయాల్లో ఎవరు ఔనన్నా.. కాదన్నా.. కుల, మత రాజకీయాలకు ప్రత్యేకస్థానం ఉంటుంది. ఏ పార్టీ అయినా ఆ వ్యూహంలో భాగంగానే రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. దానికి పవన్ కల్యాణ్ అతీతడేమీ కాదు. ఆయన ఎవర్నీ నొప్పించకుండా హిందువుల్ని ఆకట్టుకునే రాజకీయాలు చేయడానికి సిద్దమయ్యారని అనుకోవచ్చు. అయితే పవన్ కల్యాణ్ తన స్పందన వెనుక ఎలాంటి రాజకీయం వ్యూహం ఉందని చేశారో కానీ.. రాజకీయంగా మాత్రం చర్చనీయాంశం అవుతోందని అనుకోవచ్చు.
Key post for JC Pawan | జేసీ పవన్ కు కీలక పదవి | Eeroju news