Jaipur:కశ్మీర్ లా మారిపోయిన రాజస్థాన్:రాజస్థాన్ ఈ పేరు వినిపిస్తే చాలు ఎడారి గుర్తుకువస్తుంది.. మండే ఎండలు, ఇసుక దిబ్బల ప్రాంతం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక మామూలుగా ఫిబ్రవరి నుంచే అక్కడ ఉష్ణోగ్రతలు మండిపోతుంటాయి.. జనాలకు చుక్కలు చూపిస్తుంటాయి.విస్తరించిన ఎడారికి, కనుచూపుమేర కనిపించే ఇసుకదిబ్బలకు నెలవైన రాజస్థాన్ రాష్ట్రంలో ఫిబ్రవరి నెల నుంచే ఎండలు మండిపోతుంటాయి.
కశ్మీర్ లా మారిపోయిన రాజస్థాన్
జైపూర్, మార్చి 4
రాజస్థాన్ ఈ పేరు వినిపిస్తే చాలు ఎడారి గుర్తుకువస్తుంది.. మండే ఎండలు, ఇసుక దిబ్బల ప్రాంతం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక మామూలుగా ఫిబ్రవరి నుంచే అక్కడ ఉష్ణోగ్రతలు మండిపోతుంటాయి.. జనాలకు చుక్కలు చూపిస్తుంటాయి.విస్తరించిన ఎడారికి, కనుచూపుమేర కనిపించే ఇసుకదిబ్బలకు నెలవైన రాజస్థాన్ రాష్ట్రంలో ఫిబ్రవరి నెల నుంచే ఎండలు మండిపోతుంటాయి. ఈ ఎండల వల్ల అక్కడ అనధికారిక కర్ఫ్యూ వాతావరణం నెలకొంటుంది. అయితే ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రం కాశ్మీర్ ప్రాంతాన్ని తలపిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని చురు ప్రాంతం మంచుతో నిండిపోయింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల రాజస్థాన్ లో శుక్రవారం వడగళ్ల వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం మంచు గడ్డలతో నిండిపోయింది. ఫలితంగా అది కాశ్మీర్ ప్రాంతాన్ని తలపిస్తోంది. వడగళ్ల వర్షం కురవడం వల్ల పంటలు మొత్తం దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అక్కడ రాగి, సజ్జ, బంగాళదుంప పంటలు కోతకు వచ్చాయి.. ఈ సమయంలో వడగళ్ల వర్షం కురవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.. సాధారణంగా ఫిబ్రవరి రెండవ వారం నుంచి రాజస్థాన్ రాష్ట్రంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. ఈ ఎండల వల్ల అక్కడ జనజీవనం స్తంభించిపోతుంది..రాజస్థాన్ రాష్ట్రం అంటే నిప్పులు కురిపించే ఎండలు గుర్తుకు వస్తాయి. విస్తరించిన థార్ ఎడారి మదిలో మెదులుతుంది.
ఇసుక దిబ్బలు, ఒంటెలతో ఆ ప్రాంతం ఒక రకమైన వాతావరణంలో కనిపిస్తుంది. సాధారణంగా ఫిబ్రవరి నెల నుంచే రాజస్థాన్ రైతులు గొర్రెలు, మేకలు, ఆవులను మేత కోసం ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. జూన్ వరకు కూడా వారు అక్కడే ఉంటారు. ఫిబ్రవరి నుంచి రాజస్థాన్ లో ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగానే నమోదవుతుంటాయి. ఇక మార్చిలో అయితే ఎండలు మండిపోతుంటాయి. ఏప్రిల్, మే నెలల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే ఫిబ్రవరి నెలలో ఎండలు కొట్టాల్సిన రాజస్థాన్ రాష్ట్రంలో.. వడగళ్ల వర్షం కురిసింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల మంచు గడ్డలు పడ్డాయి . దీంతో ఆ ప్రాంతం మొత్తం కాశ్మీర్ రాష్ట్రాన్ని తలపిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రం లోని కొంత ప్రాంతం హిమాలయాలకు దగ్గరగా ఉంటుంది. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుంటాయి. మంచు కూడా విపరీతంగా కురుస్తూ ఉంటుంది. అయితే అలాంటి వాతావరణం ఫిబ్రవరిలో చోటు చేసుకోవడం అక్కడి ప్రజలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చేతికి వచ్చిన పంటలు దెబ్బ తినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక రాజస్థాన్ రాష్ట్రంలో కురిసిన మంచి వర్షానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. “మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరయ్యే మాకు మంచు వర్షం కాస్త సాంత్వన కలిగించింది. దీనివల్ల మాకు ఎండ నుంచి ఉపశమనం దక్కిందని” సోషల్ మీడియాలో రాజస్థాన్ వాసులు పేర్కొంటున్నారు.రాజస్థాన్ రాష్ట్రంలో నిత్యం భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. ప్రస్తుతం మొన్నటి వరకు అక్కడ ఎండలు దంచి కొట్టాయి. అలాంటి చోట మంచు వర్షం కురిసింది. ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం కాశ్మీర్ రాష్ట్రాన్ని తలపిస్తోంది.
Read more:China:పిల్లల్ని కనండి.. మహాప్రభో..