Jagan to direct fight with BJP | బీజేపీతో డైరక్ట్ ఫైట్ కు జగన్ | Eeroju news

బీజేపీతో డైరక్ట్ ఫైట్ కు జగన్

బీజేపీతో డైరక్ట్ ఫైట్ కు జగన్

విజయవాడ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్)

Jagan to direct fight with BJP

బిజెపి విషయంలో జగన్ కు భ్రమలు తొలగిపోయాయా? బిజెపి తనను అవసరానికి వాడుకుందని గ్రహించారా?మున్ముందు ఆ పార్టీతో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని గ్రహించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.ఇప్పటివరకు బిజెపి విషయంలో జగన్ చాలా రకాలుగా ఆలోచించారు.ఆ పార్టీపై పెద్దగా ఆరోపణలు కూడా చేయలేదు.అయితే ఉన్నట్టుండి ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేసుకోవడం విశేషం.జమ్మూ కాశ్మీర్ తో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే.ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తిరగరాస్తు హర్యానాలో బిజెపి అధికారంలోకి వచ్చింది.

ముచ్చటగా మూడోసారి పవర్ దక్కించుకుంది. అయితే ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది.ఉద్యోగుల ఓట్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది.ఎప్పుడైతే ఈవీఎంల లెక్క మొదలుపెట్టారో.. అక్కడ నుంచి బిజెపి దూకుడు ప్రారంభమైంది. ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. చివరకు అధికారానికి అవసరమైన సీట్లను సాధించింది. అయితే ఇక్కడ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. హర్యానాలో బిజెపి ది ప్రజా విజయం కాదని..ఈవీఎంలతో గెలిచారంటూ కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. జాతీయస్థాయిలో విపక్షాలు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేశాయి.

అదే అభిప్రాయంతో తాజాగా జగన్ మాట్లాడారు. హర్యానాలో ఎన్నికల ఫలితాలపై అనుమానం ఉన్నట్లు వ్యాఖ్యానించారు. బిజెపి విజయాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆకాంక్షించేలా మాట్లాడారుఏపీ ఎన్నికల ఫలితాల సమయంలో సైతం ఈవీఎంల టెంపరింగ్ పై ఆ వైసీపీ నేతలు చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఒక్కనాడు అంటే ఒక్కనాడు కూడా జగన్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.ప్రజల ప్రేమ మనవైపే ఉంది.కానీ ఏం జరిగిందో తెలియదు.. ఏం మాయ జరిగిందో తెలియదు.. మనం ఓడిపోయాం అని మాత్రమే అన్నారు. ఈవీఎంలలో అక్రమాలు చేయడం ద్వారా ఎన్డీఏ కూటమి గెలిచింది అని మాట సూటిగా చెప్పడానికి కూడా ఆయన మొహమాట పడ్డారు.

అయితే ఇప్పుడు కాలం కరిగే కొద్ది బీజేపీ వైఖరి బయటపడడంతో.. జగన్ సైతం తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని అర్థం వచ్చేలా మాట్లాడారు జగన్.ప్రజాస్వామ్యానికి మేలు జరగాలంటే పేపర్ బ్యాలెట్లు ఒకటే మార్గం అని జగన్ తన బలమైన వాదనలు వినిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా మోడీ మార్క్ ఎన్నికల నిర్వహణ, వరుస విజయాలపై ప్రతిపక్ష పార్టీలకు అనుమానాలు ఉన్నాయి. ఆ పార్టీలు బాహటంగానే చెప్పుకొస్తున్నాయి. అటువంటి పార్టీల జాబితాలో ఇప్పుడు వైసీపీ చేరబోతోంది. పేపర్ బ్యాలెట్స్ ప్రవేశపెట్టాలన్న డిమాండ్ తో బిజెపికి వ్యతిరేక వర్గంగా మారారు జగన్. అదే సమయంలో విపక్ష కూటమికి దగ్గర అయ్యేలా కనిపిస్తున్నారు.

బీజేపీతో డైరక్ట్ ఫైట్ కు జగన్

 

Prime Minister Modi | మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం.. ప్రధానమంత్రి మోదీ | Eeroju news

Related posts

Leave a Comment