జగన్ ఓవర్ టూ బెంగళూరు…
విజయవాడ, జూలై 16 (న్యూస్ పల్స్)
Jagan mohan reddy over to Bangalore
జగన్ ఇటీవల తరచూ బెంగళూరు వెళుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒకసారి వెళ్లారు. వారం రోజులపాటు అక్కడే ఉన్నారు. ఇప్పుడు మరోసారి వెళ్తున్నారు. వారం రోజులు పాటు అక్కడే గడపనున్నారు. ఈసారి వైద్య సేవల కోసమే ఆయన బెంగళూరు వెళ్తున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శల డోర్స్ పెరగడంతోనే ఆయన బెంగుళూరు వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా షర్మిలను కట్టడి చేసేందుకే నన్న టాక్ నడుస్తోంది. అయితే అందులో ఎంత నిజం ఉందో తెలియాలి. జగన్ కు పులివెందులతో పాటు బెంగళూరు, హైదరాబాదులో ప్యాలెస్ లు ఉన్నాయి. అందులో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సమకూర్చుకున్నవి కూడా ఉన్నాయి.
ముఖ్యంగా హైదరాబాదులోని లోటస్ ఫండ్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించినదే. వైసిపి ఆవిర్భావం కూడా అక్కడి నుంచే ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలను అక్కడి నుంచే నిర్వర్తించారు జగన్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్యాలెస్ కు పరిమితం అయ్యారు. అయితే అప్పటినుంచి లోటస్ ఫండ్ ఖాళీగా ఉంది. షర్మిల ఏపీ నుంచి తెలంగాణ వెళ్లి రాజకీయాలు చేశారు. వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. అయితే ఆమె సైతం లోటస్ ఫండ్ నుంచే తన కార్యకలాపాలను మొదలుపెట్టారు. అంటే అది ఉమ్మడి ఆస్తి కనుక.. అందులో తనకు కూడా వాటా ఉందని షర్మిల కోరినట్లు తెలుస్తోంది.
రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించింది కనుక.. జగన్ సైతం షర్మిల అందులో ఉండేందుకు అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.కేవలం ఆస్తి వివాదాల వల్లే సోదరుడు, సోదరి మధ్య విభేదాలు వచ్చాయి. రాజకీయంగా విభేదించేంతవరకు పరిస్థితి వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీని ద్వేషించారో అదే పార్టీలోకి షర్మిల వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అదే షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకొని జగన్ పై పోరాడుతున్నారు. గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ లోటస్ ఫండ్ తన ఆధీనంలో ఉంచుకున్నారు. అందుకే జగన్ హైదరాబాద్ వెళ్లడం లేదని తెలుస్తోంది. కేవలం షర్మిల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఒక టాక్ అయితే మాత్రం నడుస్తోంది.బెంగళూరులో విలాసవంతమైన ప్యాలెస్ జగన్ కు ఉంది.
రాజకీయాల్లో యాక్టివ్ కాకమునుపే జగన్ బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేసేవారు. రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తరువాత వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అయితే బెంగళూరులో ముచ్చటపడి యలహంక ప్రాంతంలో ఒక ప్యాలెస్ ను కట్టుకున్నారు. అదే ప్యాలెస్ లోకి ఇప్పుడు వెళుతుంటారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత భార్యతో కలిసి పులివెందుల వెళ్లారు. అక్కడ నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఐదు రోజులపాటు అక్కడే గడిపారు. సీఎంగా ఉన్నప్పుడే కాలికి గాయంతో బాధపడ్డారు జగన్. ఇప్పుడు వైద్యం చేసుకునేందుకు మరోసారి బెంగళూరు వెళ్తున్నారు.అయితే బెంగళూరు పర్యటన వెనుక ఎటువంటి రాజకీయ కోణం లేదని వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.
హైదరాబాదులోని లోటస్ ఫండ్ షర్మిల ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జగన్ సైతం హైదరాబాద్ వెళ్లకుండా.. బెంగళూరులో తన సొంత ఇల్లు ఉండడం కారణంగా అక్కడికి వెళుతున్నట్లు సమాచారం. అయితే కేవలం రాజకీయ కోణంలో చూసి.. కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగించేందుకే తరచూ జగన్ బెంగళూరు వెళ్తున్నట్లు టాక్ నడిచింది. తనను జగన్ కలిశారన్న ప్రచారానికి చెక్ చెప్పారు డీకే శివకుమార్. దానిలో ఎలాంటి నిజం లేదని కూడా తేల్చి చెప్పారు. ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ట్రబుల్ షూటర్ గా ఉన్న డీకే శివకుమార్ ఈ తరహా ప్రకటన చేశారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జగన్ బెంగళూరు వెళుతుంది కేవలం షర్మిల హైదరాబాద్ లోని లోటస్ ఫండ్ స్వాధీనం చేసుకోవడమే కారణమని తెలుస్తోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.
Former CM Jagan will go to Bangalore | బెంగళూరు వెళ్లనున్నమాజీ సీఎం జగన్ | Eeroju news