Jagan is going to do a yatra to reassure the activists | YS Jagan | కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు యాత్ర చేయబోతున్న జగన్ | Eeroju news

Jagan is going to do a yatra to reassure the activists

కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు యాత్ర చేయబోతున్న జగన్

విజయవాడ, జూన్ 21, (న్యూస్ పల్స్)

Jagan is going to do a yatra to reassure the activists :

వైసీపీ అధినేత జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమిని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను, రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని జగన్ నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ ప్రధానంగా పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులపై జరుగుతున్న దాడులపై చర్చించినట్లు సమాచారం.ఈ సమావేశంలో మాట్లాడిన జగన్ ఓటమి భావనను మరిచిపోవాలని నేతలకు సూచించారు. అంతే కాకుండా ప్రతీ ఇంటికీ తలెత్తుకుని పోవాలని తెలిపారు. కాలం గడిచే కొద్దీ మళ్లీ ప్రజల అభిమానం వ్యక్తం అవుతుందని, భవిష్యత్తులో రికార్డు స్థాయిలో గెలుస్తామని చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ సానుభూతి పరుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వారందరికీ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పార్టీపై ఉందని గుర్తు చేశారు.ఈ క్రమంలోనే రాజకీయ దాడుల్లో గాయపడిన వారితో పాటు వైసీపీ ఓటమి బాధతో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఓదార్పు యాత్ర కారణంగా క్రింది స్థాయిలో ఉండే నేతలు, కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతో పాటు రాజకీయ పోరాటానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం.ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది.  జగన్‌కు వయసుతోపాటు సత్తువ కూడా ఉందని చెప్పుకొచ్చారు. ప్రజలతో కలిసి చేసే పోరాటాల్లో వైఎస్సార్‌సీపీకి, జగన్‌కు ఎవ్వరూ సాటిరారని అన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు చేస్తామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవారి పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి… నిలబడి చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటాయన్నారు. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా ఇప్పటికే చంద్రబాబు పాపాలు పండుతూనే ఉన్నాయని కామెంట్స్ చేశారు.ఓటమి భావనను మరిచిపోవాలని నేతలకు జగన్ సూచించారు. మంచి చేశామని… ప్రతీ ఇంటికీ కూడా మనం తలెత్తుకుని పోగలమన్నారు. కాలం గడిచే కొద్దీ మన పట్ట మళ్లీ అభిమానం వ్యక్తమవుతుందని… మళ్లీ మనం రికార్డు మెజార్టీతో గెలుస్తామని చెప్పుకొచ్చారు.

AP EX CM Jagan’s luxurious life on screen | YS Jagan | జగన్ విలాస జీవితం

YS Jaganగతంలో ఎప్పుడూ లేని విధంగా మన కార్యకర్తలమీద, సానుభూతి పరులమీద దాడులు చేస్తున్నారని, ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారని అన్నారు. వారందరికీ నేతలు భరోసా ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ప్రతీ అభిమానికీ, కార్యకర్తకూ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంటుందని గుర్తు చేశారు.ఈ భేటీకి పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు నేతలు తోడుగా ఉండాలని జగన్ దిశానిర్దేశం చేశారు. రాజకీయదాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని… వారిలో ఆత్మస్థైర్యం నింపాలని సూచించారు. రాబోయే రోజుల్లో తాను కూడా నేరుగా వచ్చి కార్యకర్తలను కలుస్తానని చెప్పారు. ప్రతీ కార్యకర్తనూ కలిసి వారికి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తానని చెప్పుకొచ్చారు.మన పార్టీ కోసం కష్టపడుతూ…. జెండాలు మోసిన కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్నవారి నుంచి ప్రలోభాలు ఉంటాయని…. వాటి ఎదుర్కొనే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు తోడుగా ఉండాలని చెప్పారు. కార్యకర్తలను, నేతలను పిలిచి మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని…. ఓటమిని మరిచిపోయి పని చేసుకోవాలన్నారు.175 సీట్లు సాధిస్తామని ధీమాగా చెప్పిన వైసీపీ నేతలు 11 సీట్లలో మాత్రమే గెలిచి.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టిన జగన్ వైసీపీ నేతలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించి వారికి దిశానిర్దేశం చేశారు

 

Jagan is going to do a yatra to reassure the activists

Related posts

Leave a Comment