Jagan and Sharmila | జగన్ వ్యూహాత్మక తప్పిదం… | Eeroju news

జగన్ వ్యూహాత్మక తప్పిదం...

జగన్ వ్యూహాత్మక తప్పిదం…

విజయవాడ, అక్టోబరు 30, (న్యూస్ పల్స్)

Jagan and Sharmila

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్. ఈ అంశంలో స్పేస్ లేకపోయినా టీడీపీని తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రయత్నించింది. అయితే ప్రధానంగా తమ ఎటాక్ మాత్రం జగన్ సోదరి షర్మిపైనే గురి పెట్టారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. షర్మిల కూడా వాటికి కౌంటర్ ఇచ్చారు. కానీ ఈ మొత్తం అంశంలో వైఎస్ఆర్‌సీపీ చివరికి వెనక్కి తగ్గింది. ఇక ఎవరూ మాట్లాడవద్దని తమ పార్టీ నేతలకు సందేశం పంపింది. ఆస్తుల విషయం కోర్టులో ఉంది కాబట్టి అక్కడే వాదనలు వినిపించుకుందామని చెప్పింది. కానీ ఇప్పటి వరకూ జరిగిన రాజకీయంలో జరిగిన డ్యామేజ్‌ను మాత్రం కవర్ చేసుకోవడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం ఉందని చాలా మందికి తెలుసు. కానీ ఎప్పుడూ అటు షర్మిల కానీ ఇటు జగన్ కానీ బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ప్రజల్లో చర్చనీయాంశం చేయలేదు. ఏదైనా అంతర్గతంగానే చర్చించుకున్నారు. కానీ ఎప్పుడు అయితే జగన్ తన సోదరి, తల్లిపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు వేశారో.. ఆ విషయం ఎప్పుడు బయటకు తెలిసిందో అదే పెచ్చ సంచలనం అయింది. తల్లి, చెల్లిపై జగన్ కోర్టుకెల్లడం అదీ కూడా గిఫ్ట్ గా ఇచ్చిన ఆస్తుల్ని వెనక్కి తీసుకుంటానని చెప్పడం ఏమిటన్న చర్చ రాష్ట్రమంతటా నడిచింది. దీనిపై వైసీపీ ఏ వాదన వినిపించినా.. తల్లి, చెల్లిని కోర్టుకు లాగిన జగన్ అన్న మాటే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లింది. షర్మిల తమ మధ్య ఆస్తుల వివాదం ఉందని ఎప్పుడూ ప్రకటించలేదు. ఎన్సీఎల్టీలో కేసు వేసిన తర్వాత మాత్రమే ఆమె స్పందించారు.

వైసీపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేస్తూండటం.. సాక్షి పత్రికలో జగన్ వాదన వినిపిస్తూ.. షర్మిలదే తప్పు అని ఓ పేజీ కథనం ప్రచురించడంతో ఆమె కూడా తన వాదన వినిపిస్తూ లేఖ విడుదల చేశారు. వైసీపీ నేతలు తర్వాత ప్రెస్‌మీట్లు పెట్టి వరుసగా విమర్శలు చేస్తూండటంతో ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు పెట్టుకున్నారు. విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి షర్మిల చంద్రబాబును ఇంప్రెస్ చేయడానికి పసుపుచీర కట్టుకుని వెళ్లారని చేసిన వ్యాఖ్యలతో వైసీపీ వ్యవహారంపై ప్రజల్లో మరింత నెగెటివ్ చర్చకు దారి తీసింది. ఈ విషయాన్ని గుర్తించి ఇక ఆపేయాలని వైసీపీ నిర్ణయించుకుంది.

సోదరి షర్మిలకు జగన్ ప్రేమతో తన స్వార్జితాన్ని పంచాలనుకున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అయితే తాను జగన్ కోసం వైసీపీ కోసం ఎంత కష్టపడ్డానో చెబుతున్న షర్మిల తన కోసం ఒక్క సాయం అయినా చేశారో చెప్పాలన్నారు. రాజకీయ పదవుల్ని ఇవ్వలేదు. పార్టీలో పదవుల్ని ఇవ్వలేదు. తనకు రావాల్సిన ఆస్తులు ఇవ్వడానికే ఇబ్బంది పెడుతున్నాని షర్మిల అంటున్నారు. సాధారణంగా మహిళ వైపే సానుభూతి ఉంటుంది. జరుగుతున్న విషయాలతో పాటు ఆమె కన్నీరు పెట్టుకోవడంతో వైసీపీ సానుభూతి పరుల్లోనూ షర్మిలకే అడ్వాంటేజ్ కనిపిస్తోంది. అందుకే వైసీపీ వీలైనంతగా అండర్ ప్లే చేయడానికి డిసైడయింది.

జగన్ వ్యూహాత్మక తప్పిదం...

YV Subbareddy Comments on Jagan – Sharmila Issue| షర్మిల – జగన్ ఆస్తుల పై ..బాబాయ్ హాట్ కామెంట్స్..!

Related posts

Leave a Comment