మాజీ సీఎం జగన్ కు 11 సెగ మాత్రం ఇప్పుడిప్పుడే వదిలేలా లేదు. ఏపీలో ఎన్నికలు ముగిసి 7 నెలలు కావస్తున్నా, 11 నెంబర్ మాత్రం వైసీపీని వదలట్లేదు. సోషల్ మీడియాలో 11 నెంబర్ కు ఒక క్రేజ్ తెచ్చేలా మీమ్స్ కూడ వైరల్ గా మారాయి. ఆ మీమ్స్ ఓ రేంజ్ లో ఉండడంతో వైసీపీకి పెద్ద తలనొప్పులు తెస్తున్నాయని చెప్పవచ్చు.
దేవుడిచ్చిన 11…
కడప, జనవరి 4
మాజీ సీఎం జగన్ కు 11 సెగ మాత్రం ఇప్పుడిప్పుడే వదిలేలా లేదు. ఏపీలో ఎన్నికలు ముగిసి 7 నెలలు కావస్తున్నా, 11 నెంబర్ మాత్రం వైసీపీని వదలట్లేదు. సోషల్ మీడియాలో 11 నెంబర్ కు ఒక క్రేజ్ తెచ్చేలా మీమ్స్ కూడ వైరల్ గా మారాయి. ఆ మీమ్స్ ఓ రేంజ్ లో ఉండడంతో వైసీపీకి పెద్ద తలనొప్పులు తెస్తున్నాయని చెప్పవచ్చు. ఇటీవల ఓ కారుకు గల నెంబర్ తో ట్రోలర్స్ విపరీతంగా ట్రోలింగ్ చేస్తుండడం విశేషం.ఏపీలో ఎన్నికల ఫలితాలు కూటమి, వైసీపీ పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చాయి. కూటమికి ఊహించని రీతిలో 164 సీట్లు రాగా, వైసీపీకి 11 సీట్లు దక్కాయి. ఫలితాలు విడుదలైన సమయం కాస్త ట్రోలింగ్ అంతగా లేదని చెప్పవచ్చు. రాను రాను 11 నెంబర్ పై మాత్రం పరోక్షంగా ట్రోలర్స్ తమ సత్తా చాటుతూ, సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నారు. కూటమికి వచ్చిన 164 నెంబర్ ని కూడితే 11 వస్తుంది. అదే వైసీపీకి దక్కిందని కొందరు విపరీతంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగించారు.అంతేకాదు జబర్దస్ట్ లాంటి కామెడీ షోలలో కూడ హైపర్ ఆది వంటి కమెడియన్స్ తమ స్కిట్ లలో 11 గురించి ప్రస్తావించి నవ్వులు పూయించారు. ఇలా ఏపీలో 11 నెంబర్ అంటేనే వైసీపీ గుర్తొచ్చేలా సోషల్ మీడియా పరోక్షంగా కోడై కూస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఉండి ఎమ్మేల్యే త్రిబుల్ ఆర్ ( రఘురామ కృష్ణంరాజు ) వాహనం నెంబర్ ను ఉద్దేశించి, 11 నెంబర్ మరోమారు తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ కారు నెంబర్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అందుకు ప్రధాన కారణం ఆ కారు నెంబర్ ఏపీ 11 ఏపీ 1111 కావడమే.ఏపీ డిప్యూటీ స్పీకర్ హోదాలో గల ఎమ్మేల్యే రఘురామ కృష్ణంరాజుకు చెందిన కారుగా ఇది ప్రచారం సాగుతోంది. కాగా పదేళ్ల క్రితం త్రిబుల్ ఆర్ ఈ కారు నెంబర్ ను పొందినట్లు సమాచారం. యాదృచ్చికంగా ఆ కారు నెంబర్ లో అన్నీ 11 లు ఉండడంతో, రాజు గారూ.. మీరు సూపర్ టీడీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీకి కేవలం 11 సీట్లు దక్కినా, రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని, ఇలా ట్రోలింగ్ చేయడం కూడ సబబు కాదని పలువురి అభిప్రాయం. ఏదిఏమైనా వైసీపీకి 11 నెంబర్ సెగ మాత్రం ఇప్పుడిప్పుడే వదిలేలా లేదని చెప్పవచ్చు.
Read:Anantapur:బీజేపీ వర్సెస్ టీడీపీ