Jagadishwar Reddy challenge to Bhatti | భట్టికి జగదీశ్వర్ రెడ్డి సవాల్ | Eeroju news

భట్టికి జగదీశ్వర్ రెడ్డి సవాల్

భట్టికి జగదీశ్వర్ రెడ్డి సవాల్

హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్)

Jagadishwar Reddy challenge to Bhatti

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై ఆయన మండిపడ్డారు. బహిరంగ సవాల్ కూడా విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రా కూల్చివేతలతో ఇప్పటికే రూ. వెయ్యి కోట్లకు పైగా ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లింది. రూ. వందల కోట్లు కొల్లగొట్టి కడుపులు నింపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. హుస్సేన్ సాగర్, మూసీ పాపాలకు కాంగ్రెస్ కారణం కాదా? భట్టి విక్రమార్క తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం ప్రభుత్వానికి అక్రమ నిర్మాణాలను కూల్చే దమ్ముందా..? చెరువుల విషయంలో భట్టి విక్రమార్క చర్చకు సిద్ధమా..? గూగుల్ మ్యాప్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చెరువుల పరిస్థితి ఎలా ఉందనేదానిపై చర్చిద్దామా..? అంటూ ఆయన సవాల్ విసిరిరారు.

‘హైడ్రా, మూసీ వార్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తోందంటూ బీఆర్ఎస్ నేతలు వరుసబెట్టి విమర్శలు చేస్తున్నారు. తాము కట్టిన ప్రాజెక్టులతో నీళ్లివ్వడం చేత కావట్లేదని, ఆఖరికి కరెంట్, మంచి నీళ్లు కూడా సర్కారు ఇవ్వలేకపోతోంది. కానీ, లక్షా 50 వేల కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తామంటూ డ్రామాలు చేస్తున్నారు. మూసీ నీళ్లను మురికి నీళ్లుగా మార్చిన పాపంమీదే. మూసీ, హైదరాబాద్ చెరువుల కబ్జాలపై చర్చకు సిద్ధమా?. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులను కూలగొట్టే దమ్ము భట్టి విక్రమార్కకు, సీఎం రేవంత్ రెడ్డికి ఉందా?. అబద్ధాల్లో భట్టి సీఎంనే మించిపోతున్నారు.

అంతేకాదు, డబ్బుల సంపాదనలోనూ రేవంత్ రెడ్డితో భట్టి పోటీ పడుతున్నారురు. మూసీ ప్రణాళిక భట్టి దగ్గర ఉంటే చూపించాలని ఛాలెంజ్ విసురుతున్నా. బడే భాయ్ నోట్ల రద్దుతో ఎలాంటి తప్పు చేశారో, చోటా భాయ్ హైడ్రా అంటూ అదే తప్పును రిపీట్ చేస్తున్నారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకే మూసీ సుందరీకరణ డ్రామాను తెరపైకి తెచ్చారు. మూసీ ప్రక్షాళన పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 16,500 కోట్లతో డీపీఆర్ తయారు చేశాం. హైడ్రా, మూసీ అంశాల్లో ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు.

ప్రజలు మాట్లాడినా, ప్రశ్నించినా కేసులు పెడుతున్నారు. ఎంతోమంది నియంతల్ని చూసిన తెలంగాణ ఇది, రేవంత్ రెడ్డి ఓ లెక్కా..?. కేసులు పెట్టి జైల్లో వేస్తే ప్రజలు మాట్లాడటం మానేస్తారు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. సోషల్ మీడియా పిల్లలకే భయపడుతున్న రేవంత్‌కు కేసీఆర్ కావాల్నా.. ఫస్ట్ వాళ్లకు సమాధానం చెప్పమనండి’ అంటూ మాజీమంత్రి వ్యాఖ్యానించారు.

భట్టికి జగదీశ్వర్ రెడ్డి సవాల్

 

Revanth Reddy, Batti Vikramarka effigy burning | రేవంత్ రెడ్డి,బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనం | Eeroju news

Related posts

Leave a Comment