రాబోయే ఐదేళ్లలో ఏపీని ఐటి హబ్‌గా మార్చేందుకు మంత్రి లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఉపాధి కల్పన సబ్ కమిటీ ఛైర్మన్‌గా లోకేష్ రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించేందుకు కృషి చేస్తున్నారు. 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పని చేస్తున్నారు.గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో నారా లోకేష్.. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు.
ఐటీ హబ్ దిశగా అడుగులు.
విజయవాడ, డిసెంబర్ 28
రాబోయే ఐదేళ్లలో ఏపీని ఐటి హబ్‌గా మార్చేందుకు మంత్రి లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఉపాధి కల్పన సబ్ కమిటీ ఛైర్మన్‌గా లోకేష్ రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించేందుకు కృషి చేస్తున్నారు. 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పని చేస్తున్నారు.గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో నారా లోకేష్.. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పెద్దఎత్తున పరిశ్రమలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా.. డీప్ టెక్‌ను అభివృద్ధి చేసి.. తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని లోకేష్ సంకల్పించారు. ఇందులో భాగంగా ఇన్నొవేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఫిజిక్స్ వాలాతో ఎంవోయూ కుదుర్చుకున్నారు.
1.గత ఆరు నెలలుగా లోకేష్ చేసిన కృషి ఫలితంగా గూగుల్ క్లౌడ్, టీసీఎస్ వంటి కంపెనీలు రాష్ట్రంలో యూనిట్లను స్థాపించేందుకు ముందుకు వచ్చాయి.
2.ఇప్పటికే 5 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న హెచ్‌సీఎల్, మరో 15 వేల ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరించడానికి ముందుకు వచ్చింది. లోకేష్‌తో చర్చల అనంతరం ఫాక్స్ కాన్ సిటీ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.
3.ఏపీలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అక్టోబర్ 25 నుంచి వారంరోజుల పాటు లోకేష్ అమెరికాలో పర్యటించారు. సిలికాన్ వ్యాలీ, సీటెల్, న్యూయార్క్‌తో సహా ప్రధాన అమెరికా నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలపై ప్రపంచస్థాయి టెక్నాలజీ సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చలు జరిపారు.
4.టెస్లా, గూగుల్, యాపిల్, అడోబ్, మైక్రోసాఫ్ట్, ఫాల్కొన్ ఎక్స్, సేల్స్ ఫోర్స్, జడ్ స్కాలర్ వంటి 100 ప్రముఖ కంపెనీల ప్రతినిధులను కలిసి.. రాష్ట్రంలో ఆయా సంస్థల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరించారు.
5.ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలను లోకేష్ ప్రకటించారు. దేశంలో మరే రాష్ట్రంలోని లేని విధంగా ప్రోత్సాహకాలతో 2024-29 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం, ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ అండ్ డిస్ల్పే ఫ్యాబ్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీలను ప్రకటించారు.
6.కేవలం ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ పరిశ్రమలపైనే కాకుండా.. ఇతర భారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్ చొరవతో రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు టాటా గ్రూప్ సిద్ధమైంది.
7.రాష్ట్రంలో రూ.65 వేల కోట్లతో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్ల స్థాపనకు రిలయన్స్ ఎనర్జీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఆదిత్యమిట్టల్తో మంత్రి లోకేష్ జరిపిన వీడియోకాల్ చర్చలు ఫలించాయి. రెండుదశలుగా రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో రూ. 1,40,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ జాయింట్ వెంచర్ ముందుకు వచ్చింది. జనవరిలో రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని నరేంద్రమోదీ అనకాపల్లి వద్ద ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేయనున్నారు.
8.ముంబయిలో మంత్రి లోకేష్ జరిపిన చర్చల ఫలితంగా.. వేదాంత అనుబంధ సంస్థ సెరెంటికీ గోల్డ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తంచేసింది. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రూ.60 వేల కోట్లతో 10వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులను స్థాపించేందుకు ఆ సంస్థ సిద్ధమైంది.
9.రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కింద చేపట్టిన 3 ప్రాజెక్ట్‌ల కోసం.. మొబైల్ టవర్లు, రైట్ ఆఫ్ వే కోసం భూమి కేటాయింపులు, అనుమతులు మంజూరు చేశారు. గిరిజన, గిరిజనేతర మారుమూల ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ బ్లాక్ స్పాట్లను గుర్తించి, పరిష్కారానికి కృషిచేస్తున్నారు.
10.రాష్ట్రంలో ఈ-గవర్నెన్స్ అమలులో భాగంగా జీవోల జారీ రిజిస్టర్ పోర్టల్‌ను పునరుద్దరించారు. ఈ-కేబినెట్ ప్రాజెక్ట్‌ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. పౌరులకు సంబంధించిన 134న రకాల సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా అందించేలా మెటాతో కీలక ఒప్పందం చేసుకున్నారు.
Read:ప్రజావాణి లో 154 అర్జీలు.. సెలవు దినం అయినా కొనసాగిన ప్రజావాణి